చిత్ర పరిశ్రమలో యంగ్ హీరోలు పెళ్లి బాట పడుతున్నారు. కెరీర్ పీక్స్ ఉన్నప్పుడే పెళ్లిళ్లు చేసుకొని ఒక ఇంటివారవుతున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కాస్తా.. పర్ఫెక్ట్ హస్బెండ్స్ గా మారిపోతున్నారు. ఇక ఈ లిస్టులోకి చేరిపోయాడు టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి. ఇటీవలే హీరోయిన్ నిక్కీ గల్రాని తో నిశ్చితార్థం చేసుకున్న ఈ హీరో నేడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. మొన్నటికి మొన్న ఎంగేజ్ మెంట్ కూడా సీక్రెట్ గా జరుపుకున్న ఈ హీరో పెళ్లి కూడా చడీచప్పుడు లేకుండా జరుపుకోవడం విశేషం. అతి కొద్దిమంది సన్నహితులు, ఇండస్ట్రీ పెద్దలు మాత్రమే ఈ పెళ్ళికి హాజరుకానున్నారని సమాచారం. ఇప్పటికే ఈ పెళ్లి తంతు మొదలైపోయింది. ఉదయం వధూవరులకు హల్దీ ఫంక్షన్ నిర్వహించారు.
పసుపు బట్టలతో ఉన్న నిక్కీ, ఆది కి స్నేహితులు పసుపు రాసి ఆటపట్టిస్తున్నారు. కాబోయే వధూవరులిద్దరూ పసుపు నీళ్లలో తడిసి ముద్దయి పోయారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ జనతా లవ్ స్టోరీ గురించి అందరికి తెలిసిందే. ఆది పినిశెట్టి – నిక్కీ గల్రాని కలిసి గతంలో ‘యాగవరాయినుం నా కాక్క’ అనే తమిళ సినిమాలో నటించారు. ఇది తెలుగులో ‘మలుపు’ పేరుతో విడుదలైంది. అలానే ‘మరకతమణి’ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆ సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడం, ఇరు కుటుంబాలను ఒప్పించి ఈ జంట ఈరోజు ఒక్కటి కానున్నారు.ఇక ఆది కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం హీరోగా రెదను సినిమాలు చేస్తూనే రామ్ నటిస్తున్న ‘ది వారియర్’ చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.