ట్రోలింగ్‌తో సినిమాలు చాలా నష్టపోతాయి. ట్రోలింగ్ బారినపడితే వచ్చే నెగిటివిటీ అంతా ఇంతా ఉండదు. అయితే ఒక్కోసారి ట్రోలింగ్‌తో కూడా మంచి జరుగుతుందా? ఆదర్శ కుటుంబం విషయంలో జరిగిన ఆ మంచేంటో మనమూ చూద్దామా? దసరాకు రావాల్సిన ఆదర్శ కుటుంబం 30న థియేటర్లలోకి వచ్చింది. గుంటూరు కారం వంటి ఫ్లాప్ తర్వాత వస్తున్న గురూజీ సినిమా కావడంతో ఎలా ఉంటుందన్న భయం వెంకీ ఫ్యాన్స్‌లో ఉంది. ఓకే అన్న టాక్ రావడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ‘మాల’ సాంగ్ సినిమాలో లేకపోవడం షాక్ ఇచ్చింది.
మాల సాంగ్ రిలీజ్ అయిన వెంటనే నెగిటివిటీ తీసుకొచ్చింది. అందులో కొన్ని పదాలపై అభ్యంతరం వ్యక్తంచేశారు. ట్రోలింగ్ సంగతి పక్కనపెడితే స్టోరీ టెల్లింగ్‌కి ఈ సాంగ్ అడ్డుపడేది. రిలీజ్ తర్వాత పాటపై మరింత ట్రోలింగ్ జరిగే ఛాన్స్ ఉందని గ్రహించిన మేకర్స్.. ఈ కాంట్రవర్సీ సాంగ్‌ని తొలగించారు. అక్టోబర్ 9న రావాల్సిన ఆదర్శ కుటుంబం పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా వేశారు. లేట్ అయినా మరింత బెటర్ ఔట్‌పుట్ కోసమే రిలీజ్ చేయలేదు అన్నారు. ఒకవేళ ఇదే డేట్‌కి వస్తే ‘మాల’ సాంగ్‌తో వచ్చి సినిమా మరింత ట్రోల్ అయ్యేదేమో! నెగిటివ్ ఎఫెక్ట్ పడకుండా ఈ ట్రోలింగ్ యూజ్ అయ్యింది.

