NTV Telugu Site icon

Sarkaru Vaari Paata: కళావతి ప్రేమలో మునిగితేలుతున్న మహేష్

sarkaru vaari paata

sarkaru vaari paata

సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచుతున్న క్షణం రానే వచ్చింది. సర్కారు వారి పాట చిత్రం నుంచి మొదలై సింగిల్ రాబోతుంది. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా గీతా గోవిధం ఫేమ్ పరుశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. మైత్రి మోవి మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ ని ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14 న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

కళావతి అంటూ సాగే ఈ సాంగ్ పోస్టర్ ని తాజగా మేకర్స్ రిలీజ్ చేసి సాంగ్ పై అంచనాలను పెంచేశారు. ఇక ఈ పోస్టర్ లో మహేష్, కీర్తి అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించారు. కీర్తి వీపుపై అనుకోని మహేష్ ప్రేమ పరవశంలో మునిగి తేలుతున్నట్లు కనిపించాడు. మొదటి నుచ్న్హి ఈ సినిమాలో మహేష్ ని అల్ట్రా స్టైలిష్ లుక్ లోనే పరశురామ్ చూపించాడు. ఇక ఇందులో కూడా అదే లుక్ మెయింటైన్ చేయడంతో మహేష్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఎప్పుడెప్పుడు వాలెంటెన్స్ డే వస్తుందా .. సాంగ్ విందామా అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమా వేసవి కానుకగా మే 12 న విడుదల కానుంది. మరి ఈ సినిమాతో మహేష్ మరో హిట్ ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో చూడాలి.

Show comments