యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి మెసేజ్ రంగులు అద్దిన కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెకండ్ సినిమా ‘దేవర’. జనతా గ్యారేజ్ తో టాలీవుడ్ వరకే బాక్సాఫీస్ ని రిపేర్ చేసిన ఈ కాంబినేషన్ ఈసారి పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చేస్తున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో సాలిడ్ యాక్షన్ ఎపిసోడ్స్ తో, ఒక కొత్త వరల్డ్ ని క్రియేట్ చేసి ఎన్టీఆర్ ని దేవరగా ప్రెజెంట్ చేయనున్నాడు కొరటాల శివ. సూపర్బ్ ఫామ్ లో ఉండి, కేవలం తన మ్యూజిక్ తోనే సినిమాలను హిట్ అయ్యేలా చేస్తున్న అనిరుద్ దేవర సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. అనిరుద్ దేవరకి మ్యూజిక్ ఇవ్వడం అగ్నికి వాయువు తోడైనట్లు అయ్యింది. ఎన్టీఆర్ కి పోటీగా నార్త్ నుంచి సైఫ్ అలీ ఖాన్ విలన్ గా దించిన కొరటాల శివ, బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ ఎపిసోడ్స్ ని షూట్ చేస్తూనే ఉన్నాడు. విజువల్ ఎఫెక్ట్స్ కి టైమ్ ఇవ్వడానికే ముందు యాక్షన్ పార్ట్ ని చిత్ర యూనిట్ షూట్ చేస్తున్నారు. త్వరలో స్టార్ట్ అవ్వనున్న కొత్త షెడ్యూల్ లో కూడా ఫైట్ నే షూట్ చేయనున్నారు.
ఈ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ అయ్యాక దేవర సినిమా టాకీ పార్ట్ షూటింగ్ స్టార్ట్ అవ్వనుంది. ఇప్పటివరకూ మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ అయిన దేవర సినిమా నుంచి నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. షూటింగ్ అప్డేట్స్ వస్తున్నాయి కానీ ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ బయటకి రావట్లేదు. ఆ లోటుని మరో మూడు రోజుల్లో తీర్చనున్నారు దేవర చిత్ర యూనిట్. ఆగస్టు 16న సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే కావడంతో ఆరోజున సైఫ్ కి సంబంధించిన పోస్టర్ ని మేకర్స్ రిలీజ్ చేయడానికి రెడీ అవ్వనున్నారు. ఈ పోస్టర్ లో సైఫ్ తో పాటు ఎన్టీఆర్ కూడా ఉంటే పాన్ ఇండియా వైడ్ దేవర హాట్ టాపిక్ అవ్వడం గ్యారెంటీ. మరి ఆగస్టు 16న వదలనున్న పోస్టర్ ఎలా ఉంటుందో చూడాలి.