యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, “కేజిఎఫ్” ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్స్ చాలాకాలం క్రితమే ప్రకటించారు. మధ్యలో కరోనా సెకండ్ వేవ్ అడ్డు తగిలినప్పటికీ ప్రభాస్ “సలార్” సినిమా కోసం కేటాయించిన డేట్స్ కు మాత్రం ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. అందుకే అనుకున్న సమయానికే సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సినిమా రెండో షెడ్యూల్‌ను ప్రారంభించారు.
Read Also : నగ్న ప్రదర్శనకు ‘నో’… అందుకే అవకాశాలు దూరం
ఈ షెడ్యూల్‌లో ప్రభాస్, శృతి హాసన్ పాల్గొంటున్నారు. తాజా అప్డేట్ ఏమిటంటే “సలార్” మేకర్స్ ఈ సినిమా మేకింగ్ వీడియోను త్వరలో ఆవిష్కరించడానికి ప్లాన్ చేస్తున్నారు. మేకింగ్ వీడియో రాకపై మరో రెండు రోజుల్లో అధికారిక ప్రకటన చేయబడుతుంది. మేకింగ్ వీడియో ప్రకటనతో పాటు ప్రత్యేక పోస్టర్‌ని కూడా మేకర్స్ విడుదల చేయవచ్చు. నిజంగా ఇది ప్రభాస్ అభిమానులకు బిగ్ అనౌన్స్మెంట్ అవుతుంది. మరోవైపు ప్రభాస్ “రాధేశ్యామ్” కూడా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. జనవరి 14న “రాధేశ్యామ్”తో థియేటర్లలోకి రాబోతున్నట్టు ఇటీవలే ప్రకటించారు.