Site icon NTV Telugu

September : సెప్టెంబర్ 5న సిల్వర్ స్క్రీన్‌పై మీడియం రేంజ్ సినిమాల సంగ్రామం..

Tollywood

Tollywood

మాస్ యాక్షన్ కి కొత్త డెఫినిషన్ చెప్పబోతున్న ‘ఘాటి’ సెప్టెంబర్ 5న థియేటర్స్ లో కి రానుంది! ఓ సాధారణ యువతి తన ఊరిని కాపాడుకునే పోరాటం చుట్టూ తిరిగే ఈ కథ, విలేజ్ నేటివిటీతో, ఎమోషనల్ పంచ్‌లతో, యాక్షన్ బ్లాక్స్‌తో నిండిపోయింది. తేజ సజ్జా, మంచు మనోజ్ కాంబినేషన్‌లో ‘మిరాయ్’ హై-ఆక్టేన్ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్. మాస్ బిల్డప్, సస్పెన్స్ ట్విస్ట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ కలిసిన ఈ సినిమా, టీజర్‌తోనే ఫ్యాన్స్‌కి అదిరిపోయే కిక్ ఇచ్చింది. సెప్టెంబర్ 5న థియేటర్స్‌లో ఈ పవర్ ప్యాక్డ్ క్లాష్ బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేయడానికి రెడీ అవుతోంది.

Also Read : Young Directors : హిట్ ఇచ్చినా కూడా ఖాళీగా ఉన్న యువ దర్శకులు

రష్మిక ప్రధాన పాత్రలో వస్తున్న ‘ది గర్ల్ ఫ్రెండ్’ మోడర్న్ రిలేషన్‌షిప్స్‌లోని ఎమోషనల్ లేయర్స్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్స్‌తో నిండిన రొమాంటిక్ డ్రామా. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్ లో రష్మిక చార్మ్, స్క్రీన్ ప్రెజెన్స్, మెలోడీయస్ సాంగ్స్. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అవుతున్నాయి. సెప్టెంబర్ 5న ఈ ఎమోషనల్ జర్నీ థియేటర్స్‌లో ప్రారంభమవుతుందని అంటున్నారు. వీటితో పాటు కిష్కిందా పురి మాస్ యాక్షన్, హారర్ ఎమోషనల్ డ్రామా రిలీజ్ కానుందని సమాచారం. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా గ్లింప్స్ వచ్చిన దగ్గర నుంచే ఆడియన్స్ కు ఆసక్తి ఏర్పడింది. రీసెంట్గా రిలీజ్ అయిన లిరికల్ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేస్తుంది. మరి ఈ  రేస్ లో గెలిచేది ఎవరో కాసులు రాబట్టే సినిమా ఎదో మరికొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

Exit mobile version