Site icon NTV Telugu

71 National Film Awards : జాతీయ అవార్డులు వచ్చిన వారికి ప్రైజ్ మనీ.. ఎవరికి ఎంత..?

National Awards 2025

National Awards 2025

71 National Film Awards : 2023కు గాను 71వ జాతీయ అవార్డులను కేంద్రం ప్రకటించింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి ఏడు అవార్డులు వచ్చాయి. అయితే జాతీయ అవార్డులు వచ్చిన వారికి ప్రైజ్ మనీ కూడా ఉంటుంది. ఏ అవార్డు అందుకున్న వారికి ఎంత ఉంటుంది.. తెలుగులో అవార్డులు వచ్చిన వారికి ఎంత ప్రైజ్ మనీ ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ సారి జాతీయ ఉత్తమ నటుడిగా ఇద్దరు అవార్డు అందుకున్నారు. జవాన్ సినిమాకు గాను షారుక్ ఖాన్, 12 ఫెయిర్ సినిమాకు గాను విక్రాంత్ మాసే అందుకున్నారు. వీరిద్దరూ రూ.2లక్షల అవార్డును పంచుకోవాలి. జాతీయ ఉత్తమ నటిగా ఎంపికైన రాణీ ముఖర్జీకి రూ.2లక్షలు అందజేయనున్నారు.

Read Also : Allu Arjun : తెలుగు సినిమా వెలుగుతోంది.. బన్నీ సంతోషం..

హనుమాన్ సినిమాకు రెండు అవార్డులు దక్కాయి. ఏవీజీసీ (యానిమేషన్, విజువల్‌ ఎఫెక్ట్స్, గేమింగ్‌ అండ్‌ కామిక్‌) విభాగంలో ప్రశాంత్ వర్మకు, బెస్ట్‌ యాక్షన్‌ డైరెక్షన్‌ (స్టంట్‌ కొరియోగ్రఫీ) విభాగంలో యానిమేటర్‌ జెట్టి వెంకట్‌ కుమార్‌కు అవార్డులు వచ్చాయి. వీరిద్దరికీ గోల్డ్ మెడల్ తో పాటు ఒక్కొక్కరికి రూ.3 లక్షలు అందజేస్తారు. జెట్టి వెంకట్‌ కుమార్‌ హనుమాన్ మూవీకి స్టంట్ డైరెక్టర్ గానే కాకుండా వీఎఫ్‌ ఎక్స్ సూపర్ వైజర్ గానూ పనిచేశారు. కాబట్టి ఆయనకు మరో వెండి పతకంతో పాటు ఇంకో రూ.2లక్షలు అందజేస్తారు. బేబీ మూవీ సింగర్ పీవీఎస్ ఎన్ రోహిత్ కు ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ సింగర్ అవార్డు వచ్చింది. ఆయనకు వెండి పతకంతో పాటు రూ.2లక్షలు వస్తాయి.

సుకుమార్ కూతురు సుకృతికి గాంధీతాత చెట్టు మూవీకి గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డు దక్కింది. ఇదే కేటగిరీలో ఇంకో ఇద్దరికి అవార్డులు వచ్చాయి. కాబట్టి ఈ ముగ్గురూ కలిసి రూ.2లక్షల ప్రైజ్ మనీని పంచుకోవాలి. బేబీ మూవీకి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది. ఇదే కేటగిరీలో మరో తమిళ సినిమాకు కూడా అవార్డు వచ్చింది. కాబట్టి రూ.2లక్షలను వీరిద్దరూ కలిసి పంచుకోవాలి. బలగం సినిమాలోని ‘ఊరు పల్లెటూరు’ పాటకు గాను శ్యామ్ కాసర్ల ఉత్తమ పాటల రచయితగా అవార్డు అందుకున్నాడు. ఆయనకు రూ.2లక్షల ప్రైజ్ మనీ ఇస్తారు. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్‌ కేసరి నిలిచింది. దీనికి రూ.2లక్షల ప్రైజ్ మనీ వస్తుంది.

Read Also : Kingdom : ఇంతకీ కింగ్ డమ్ హిట్టా కాదా..?

Exit mobile version