ప్రముఖ దర్శకుడు తేజ ‘1000 అబద్దాలు’ మూవీతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఎస్తర్ నోరోన్హా ఆ తర్వాత ‘భీమవరం బుల్లోడు’, ‘జయజానకీ నాయక’, ‘షకీలా’ తదితర చిత్రాలలో నటించింది. తాజాగా దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి రూపొందించిన ‘#69 సంస్కార్ కాలానీ’ చిత్రంలో ఎస్తర్ ఓ కీలక పాత్రను పోషిస్తోంది. ఈ మూవీ గురించి దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి చెబుతూ, ”గాయత్రి స్వాతి మంత్రిప్రగడ ఇచ్చిన ఓ మంచి కథతో ఈ మూవీని తీయడం జరిగింది. ఇంతకు ముందు నేను చేసిన రస్టిక్, డేరింగ్ ఫిల్మ్ ‘క్రిమినల్ ప్రేమకథ’ కు అర్చన అనే అమ్మాయితో ఎడిటింగ్ చేయించడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి ఫీమేల్ సెన్సిటివ్స్ సబ్జెక్ట్ వారైతే సరైన న్యాయం చేస్తారు. కమర్షియల్ గా హిట్ చేయాలనే ఇంటెన్షన్ తో కాకుండా సోషల్ రెస్పాన్స్ ను దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రం చేశాం.
Read Also : హీరోయిన్ పుట్టుమచ్చల వివాదం… ‘డీజే టిల్లు’ రియాక్షన్
‘రొమాంటిక్ క్రిమినల్స్’, ‘క్రిమినల్ ప్రేమకథ’ సినిమాలు ఎంత హార్డ్ హిట్టింగ్ ఉంటాయో ఇది కూడా అలాంటి హార్డ్ హిట్టింగ్ సినిమా. యూత్ తో పాటు అందరినీ ఇది అలరిస్తూ ఆలోచింప జేస్తుంది” అని అన్నారు. ఈ సినిమా గురించి నిర్మాత బాపిరాజు మాట్లాడుతూ, ”ఎక్కడో ఉన్న నన్ను నిర్మాతను చేసి ఇండస్ట్రీలో నిలబెట్టిన సునీల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు. 1982 నుంచి ఇప్పటివరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో నా ప్రయాణం సాగింది. ఈ సినిమా ఫైనాన్స్ కోసం నాగ సత్యనారాయణ గారి దగ్గరకు వెళ్ళిన నాకు ఈ సినిమాకు కథ విని తానూ నిర్మాణ భాగస్వామిగా ఉంటానని చెప్పారు. ‘పుష్ప, ఆచార్య’ సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉన్నా అజయ్ గారు మాకు సమయం కేటాయించి, ఈ చిత్రంలో నటించారు. ఇమ్మడి ప్రవీణ్ అందించిన మ్యూజిక్ బాగుంది. ఇందులో నాలుగు పాటలు ఉంటాయి. సినిమాను ఈ నెల మూడోవారంలో విడుదల చేయాలని అనుకుంటున్నాం” అని అన్నారు.