Thudakkam : 9 రోజుల్లో రూ. 36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్.. స్టార్ హీరో కూతురుకు తొలిసినిమాతోనే భారీ హిట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ కుమార్తె విస్మయ మోహన్‌లాల్ నాయికగా పరిచయమైన చిత్రం ‘తొడక్కమ్‘. ఈనెల 7న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ స్టార్ట్ అందుకుంది. జూడ్ ఆంథనీ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ మొదటి రోజు నుంచే సంచలన వసూళ్లను సాధిస్తూ ఈ ఏడాది బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గా నిలిచి థియేటర్లలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ చిత్రం, కేవలం 9 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 36.73 కోట్ల గ్రాస్ వసూలు చేసి సాలిడ్ బాక్సాఫీస్ రన్ కొనసాగిస్తోంది. ఈ 9 రోజుల వ్యవధిలో రీజనల్ వైజ్‌గా ఈ సినిమా కేరళలో రూ. 19.69 కోట్లు, కర్ణాటక రూ. 1.35 కోట్లు, తమిళనాడు రూ. 35 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 71 లక్షలు మొత్తం డొమెస్టిక్ గ్రాస్ రూ. 22.10 కోట్లు రాబట్టగా ఓవర్సీస్: $1.54 మిలియన్లు అంటే సుమారు రూ. 14.63 కోట్లుతో టోటల్ వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ. 36.73 కోట్లు వసూళ్లు చేసింది. కేవలం 9 రోజుల్లోనే రూ. 36 కోట్ల మైలురాయిని అధిగమించిన ‘తుడక్కమ్’, ఈ ఏడాదో వచ్చిన ‘బాలన్’ సినిమా ఫైనల్ రన్ రికార్డులను సైతం క్రాస్ చేసింది. తద్వారా ఈ సంవత్సరానికి గానూ మలయాళంలో 6వ హయ్యెస్ట్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది. ఎలాంటి హెవీ అంచనాలు లేకుండా వచ్చి, బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని నమోదు చేస్తూ మోలీవుడ్ స్థాయిని మరోసారి చాటిచెప్పింది. తొలి సినిమాతోనే మోహన్ లాల్ కూతురు సాలిడ్ హిట్ అందుకుని తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంది.
Also Read
- Alias Rukmini: నితిన్ కోసం రంగంలోకి దిగిన నాని.. 'అలియాస్ రుక్మిణి' షూటింగ్‌కు రెడీ!
- Prabhas : 'ఫౌజీలో ఈ సీన్ ఎంత బాగా తీశాడంటే'.. హను వర్క్ పట్ల సన్నిహితులతో ప్రభాస్
- Mahesh Babu : ‘డీసీ’ చిత్రంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్.. ఒరిజినల్ అండ్ అవుట్‌స్టాండింగ్
- Jasmin Bhasin: స్టంట్ చేస్తూ జ్ఞాపకశక్తి కోల్పోయిన నటి.. బిత్తరపోయిన షో నిర్వాహకులు!
తాజావార్తలు
-
Thudakkam : 9 రోజుల్లో రూ. 36 కోట్ల గ్రాస్ కలెక్షన్స్.. స్టార్ హీరో కూతురుకు తొలిసినిమాతోనే భారీ హిట్
-
Lakshmi Mittal Steel Plant: లక్ష్మీ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌పై రష్యా దాడి.. ఇద్దరు మృతి, 14 మందికి గాయాలు
-
Rajahmundry Tragedy: రాజమహేంద్రవరంలో విషాదం.. గోదావరిలోకి దూకిన ఏఈ కుటుంబం, ముగ్గురు గల్లంతు!
-
Alias Rukmini: నితిన్ కోసం రంగంలోకి దిగిన నాని.. ‘అలియాస్ రుక్మిణి’ షూటింగ్‌కు రెడీ!
-
El Nino: నెమ్మదిగా వేడెక్కుతున్న పసిఫిక్ జలాలు.. ప్రమాదం ముంచుకొస్తోందా?
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?