పూర్ణ, ఇషా రెబ్బ, పాయల్ రాజ్ పుత్ కీలక పాత్రలు పోషించిన వెబ్ సీరిస్ ‘త్రీ రోజెస్’. ప్రముఖ దర్శకుడు మారుతీ షో రన్నర్ గా వ్యవహరిస్తున్న ఈ వెబ్ సీరిస్ కు రవి నంబూరి రచన చేయగా, మ్యాగీ డైరెక్ట్ చేశాడు. ఎస్.కె.ఎన్. నిర్మించిన ఈ వెబ్ సీరిస్ శుక్రవారం నుండి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. పెళ్ళి కెదిగిన ముగ్గురు అమ్మాయిల మనస్తత్వాన్ని బేస్ గా తీసుకుని అడల్డ్ కంటెంట్ తో ఈ వెబ్ సీరిస్ ను తీశారనేది ఆ మధ్య విడుదలైన టీజర్ తోనూ, తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ విడుదల చేసిన ట్రైలర్ తోనూ అర్థమైపోతోంది. ప్రొడక్షన్ విషయంలో ఎక్కడ రాజీ పడలేదనేదీ తెలుస్తోంది. అయితే, ఈ తరహా వెబ్ సీరిస్ లు చాలానే వచ్చిన నేపథ్యంలో నటీనటుల సహకారంతో సాంకేతిక నిపుణులు ఎంత కొత్తగా దీనిని తీశారనేది చూడాలి. ఈ వెబ్ సీరిస్ కు బాల్ రెడ్డి సినిమాటోగ్రాఫర్ కాగా, ఎస్.బి. ఉద్ధవ్ ఎడిటర్, ఎం. ఆర్. సన్నీ సంగీత దర్శకుడు.
Read Also : సోనూసూద్ ను వెనుక కోటి మంది!