హిందీ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేసేవారికి ఈ వారాంతంలో మూడు ధమాకా షోస్ ఉన్నాయి. మొదటిది, అఫ్ కోర్స్… ఇండియన్ ఐడల్ 12! ఈ వీకెండ్ తో మ్యూజికల్ రియాల్టీ షో ప్రజెంట్ సీజన్ ఎండ్ అవుతోంది. ఆగస్ట్ 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా 12 గంటల పాటూ సాగే గ్రాండ్ ఫినాలే అతి పెద్ద హైలైట్ గా నిలవనుంది. గత ఇండియన్ ఐడల్ విన్నర్స్ తో పాటూ బాలీవుడ్ స్టార్స్ సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా అద్వాణీ కూడా హల్ చల్ చేయనున్నారు. పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మన మెగా స్టార్ చిరు కూడా ఇండియన్ ఐడల్ 12 ఫైనల్ కాంపిటీషన్ లో కనువిందు చేస్తారట! ఈ మాట ఎంత వరకూ నిజమో షో టెలికాస్ట్ అయితేగానీ తెలియదు…
Read Also : దుమ్మురేపుతున్న “దాక్కో దాక్కో మేక”… బన్నీ ఖాతాలో మరో రికార్డు
ఇక ఇండియన్ ఐడల్ 12 తరువాత రియాల్టీ షో లవ్వర్స్ చూడాల్సిన మరో థ్రిల్లర్… ‘కత్రోం కే ఖిలాడీ 11’. రకరకాల స్టంట్స్ ఆధారంగా సాగే ఈ హై ఓల్టేజ్ షో గాళ్స్ వర్సెస్ బాయ్స్ గా సాగుతుంది. అమ్మాయిలు, అబ్బాయిలు పోటీ పడి సాహసాలు చేయటం ప్రేక్షకుల్ని అలరించవచ్చు. అలాగే, సీరియస్ షో అయినప్పటికీ కామెడీ కూడా బాగానే పండుతుందని ప్రోమోస్ చూసి అంచనా వేయవచ్చు…
బిగ్ బాస్ ఓటీటీ కూడా ఈ వారాంతంలో ఆసక్తి రేపుతోంది. వూట్ డిజిటల్ ప్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ అవుతోన్న రియాల్టీ షో కరణ్ జోహర్ హోస్ట్ గా కొనసాగుతోంది. పైగా ఈసారి మొదటి వీకెండ్ ప్రేక్షకుల్ని అలరించనుంది. మొట్ట మొదటి ఎలిమినేషన్ కూడా ఉంటుందట. గతంలో బిగ్ బాస్ విన్నర్స్ గా నిలిచిన జోడీ సిద్ధార్థ్ శుక్లా, షెహనాజ్ గిల్ ప్రత్యేక అతిథులుగా బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. చూడాలి మరి, ఓటీటీలో బిగ్ బాస్ తన ఫస్ట్ వీకెండ్ స్పెషల్ షోతో నెటిజన్స్ ను ఎలా ఎంటర్టైన్ చేస్తుందో…