ఐకాన్ స్టార్ అల్లు అర్జున్న్”పుష్ప” నుంచి రీసెంట్ గా విడుదలైన “దాక్కో దాక్కో మేక” సాంగ్ జోరు ఇంకా తగ్గలేదు. తాజాగా ఈ సాంగ్ రికార్డు స్థాయి భారీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పటికే ఈ సాంగ్ 24 గంటల వ్యవధిలో అత్యధికంగా వీక్షించిన, లైక్ చేసిన టాలీవుడ్ లిరికల్ వీడియోగా సెన్సేషన్ సృష్టించింది. “దాక్కో దాక్కో మేకా” కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే 9.4 మిలియన్ వ్యూస్, 657 వేల లైక్‌లను నమోదు చేసింది. ఇప్పటికీ ‘తగ్గేదే లే’ అంటూ దూసుకెళ్తున్న ఈ సాంగ్ ఐదు భారతీయ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఒక్క తెలుగులోనే ఈ సాంగ్ 20+ మిలియన్ వ్యూస్, 860కే లైక్స్ సాధించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన పాట విజువల్స్, ఎడిటింగ్ కు విశేషంగా ప్రశంసలు కురుస్తున్నాయి. విశాల్ దడ్లాని (హిందీ), విజయ్ ప్రకాష్ (కన్నడ), రాహుల్ నంబియార్ (మలయాళం), శివమ్ (తెలుగు) మరియు బెన్నీ దయాళ్ (తమిళ్) ఐదు వెర్షన్లలో సాంగ్ ను పాడారు.
Read Also : లైవ్ : ఓటిటి వర్సెస్ థియేటర్స్
అల్లు అర్జున్, రష్మిక మందన్న, ఫాహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్ “పుష్ప : ది రైజ్ పార్ట్ 1” 2021 క్రిస్మస్ కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. ఒకవైపు ఈ సినిమా విడుదలకు ముందే వరుస రికార్డులు క్రియేట్ చేస్తుంటే మరోవైపు మేకర్స్ ను సినిమా లీకులు ఇబ్బంది పెడుతున్నాయి. ఇటీవల ఈ సినిమా నుంచి సాంగ్, ఫైట్ సీక్వెన్స్ రెండూ లీకైన విషయం తెలిసిందే. ఈ విషయంపై అల్లు అర్జున్ ఫైర్ అయ్యారనే వార్తలు కూడా వచ్చాయి. చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ లీకుల విషయమై పోలీసులను సంప్రదించింది.