Dear You: రూ.132 కోట్ల బడ్జెట్.. రూ.2,849 కోట్ల వసూళ్లు.. ఈ చైనీస్ సినిమా వెనుక అసలు కథ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dear You: ఒక సినిమా భారీ హిట్ కొట్టాలంటే వందల కోట్ల బడ్జెట్, స్టార్ హీరోలు, విజువల్స్ మాత్రమే అవసరం లేదని మరోసారి రుజువవుతోంది. కంటెంట్ ఉన్న కథలను తక్కువ బడ్జెట్‌తో రూపొందినా బాక్సాఫీస్‌ను షేక్ చేయగలవని నిరూపిస్తున్నాయి కొన్ని సినిమాలు. ఇప్పటికే ‘హనుమాన్’ వంటి సినిమాలు తక్కువ పెట్టుబడితో భారీ వసూళ్లు సాధించి సంచలనం సృష్టించాయి. ఇప్పుడు మరో తక్కువ బడ్జెట్ మూవీ ఏకంగా రూ.2,000 కోట్ల మార్క్‌ను దాటి అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తోంది. చైనాలో సంచలన విజయం సాధించిన ఈ సినిమా త్వరలో అమెరికాలో కూడా రిలీజ్ కాబోతోంది. ఇంతకీ ఆ సినిమా ఏది? అంత భారీ వసూళ్లు సాధించడానికి కారణమేంటి? అనే వివరాల్లోకి వెళ్తే..
ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ సినిమా చైనీస్ మూవీ పేరు ‘డియర్ యూ’. హాంగ్‌చున్ లాన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2026 ఏప్రిల్ 30న చైనా థియేటర్లలో విడుదలైంది. సుమారు 14 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో ఈ సినిమాను రూపొందించినట్లు సమాచారం. ఇండియన్ కరెన్సీలో ఇది దాదాపు రూ.132 కోట్లకు సమానం. అయితే పెట్టుబడితో పోలిస్తే ఈ సినిమా సాధించిన వసూళ్లు ఊహించని స్థాయిలో ఉన్నాయి. చైనా బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే 300 మిలియన్ డాలర్లకు పైగా వసూలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే ఇండియన్ కరెన్సీలో ఈ మొత్తం సుమారు రూ.2,849 కోట్లుగా ఉంటుంది.
Also Read
- Anaswara Rajan: బన్నీ మలయాళ హీరో అనుకున్నా.. ఆ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ వైరల్!
- Athulya Chandra Arrested: చితక్కొట్టి దోచేశారు.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్!
- Scene: సూర్య స్పీడ్‌కు కోలీవుడ్ షాక్.. ఏడాదిలో హ్యాట్రిక్ కొట్టేసినట్లేనా?
- Lokesh Kanagaraj: సూర్య, కార్తీలకు లోకేష్ ‘హ్యాండ్’? స్టార్ బ్రదర్స్‌ను పక్కనపెట్టి బన్నీ వెనుక పడ్డాడా!
తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా ఇంత భారీ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇప్పుడు సినీ వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా 2026లో ఊహించని బాక్సాఫీస్ విజయాల్లో ‘డియర్ యూ’ ఒకటిగా నిలవడంతో ఈ సినిమా గురించి తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సినీ ప్రేక్షకులు. చైనాలో ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందనతో అక్కడి మార్కెట్‌ను దాటి ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో కూడా హల్చల్ చేసేందుకు సిద్దమవుతోంది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 4న ‘డియర్ యూ’ ఉత్తర అమెరికాలో రిలీజ్ కాబోతోంది.
‘డియర్ యూ’ అనే టైటిల్‌కు చైనీస్ భాషలో అమ్మమ్మకు ప్రేమలేఖ అనే అర్థం వస్తుంది. పేరు వింటేనే ఇది కుటుంబం, అనుబంధం చుట్టూ తిరిగే కథ అని అర్థమవుతుంది. ‘డియర్ యూ’ (Dear You) అనేది వలసల నేపథ్యంతో కూడిన ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. అప్పులు, ఫ్యామిలీ కష్టాల ఊబిలో కూరుకుపోయిన చైనాకు చెందిన ఒక వ్యక్తి, కోటీశ్వరుడిగా స్థిరపడ్డాడని భావిస్తున్న తన తాతను వెతికేందుకు థాయ్‌లాండ్ ప్రయాణమవడంతో ఈ కథ ప్రారంభమవుతుంది. అక్కడకు వెళ్ళిన అతనికి దశాబ్దాల క్రితం నాటి ఒక హృదయవిదారక రహస్యం తెలుస్తుంది. మరి ఆ రహస్యం ఏమిటి? ఫ్యామిలీ కష్టాల నుంచి అతను ఎలా బయట పడ్డాడు ? అనే ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ఈ కథ సాగుతుంది.
రూ.132 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.2,849 కోట్లకు పైగా వసూలు చేసిన ‘డియర్ యూ’ ఇప్పుడు కేవలం చైనా బాక్సాఫీస్ హిట్ గానే కాకుండా వరల్డ్ మార్కెట్ లో కూడా ప్రత్యేకతను సంతరించుకుంటోంది. మరిన్ని బాక్సాఫీస్ వసూళ్లు దిశగా పయనిస్తోంది. మనుషుల మధ్య ఉండే భావోద్వేగ బంధాలను కథగా మలచిన ఈ సినిమా అమెరికాలో కూడా మంచి స్పందన తెచ్చుకుంటుందని భావిస్తున్నారు.
- Tags
- cinema
తాజావార్తలు
-
OBC Reservation : ఓబీసీ క్రీమీలేయర్‌పై సుప్రీం కీలక తీర్పు.. ఎవరికి వర్తిస్తుంది.?
-
Reliance Foundation: తుఫాన్ బాధిత మత్స్యకారులకు అండగా రిలయన్స్ ఫౌండేషన్.. పడవల వెలికితీతకు చర్యలు..
-
Anaswara Rajan: బన్నీ మలయాళ హీరో అనుకున్నా.. ఆ హీరోయిన్ క్రేజీ కామెంట్స్ వైరల్!
-
Karnataka: పెళ్లాం పుట్టింటికి వెళ్తోందని కక్ష.. భార్య, అత్తతో పాటు అత్తగారింటికి చెందిన ఏడుగురి హత్య
-
Athulya Chandra Arrested: చితక్కొట్టి దోచేశారు.. ‘మత్తు వదలరా’ నటి అరెస్ట్!
ట్రెండింగ్
-
The Traitors Telugu: “ది ట్రైటర్స్” తెలుగు సీజన్ 1 విజేతలుగా శ్రావ్య వర్మ, స్వీకర్ అగస్తి.. రూ.42.77 లక్షల ప్రైజ్ మనీ సొంతం..!
-
Maxwell Engineering Solutions IPO Listing: 90% ప్రీమియంతో లిస్టింగ్..ఇన్వెస్టర్లకు భారీ లాభాలు..!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!