‘రిపబ్లిక్’ నుంచి మరో సాంగ్ వచ్చింది.. ‘మహాసముద్రం’ రష్మిక మెచ్చింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న ‘రిపబ్లిక్’ సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 1న థియేటర్లోకి రానుంది. దేవకట్టా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు, టీజర్ ప్రజాస్వామ్య వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపించే ప్రయత్నాలు చేశాయి. ఇక ‘గానా ఆఫ్ రిపబ్లిక్’ లిరికల్ వీడియో కూడా ఆకట్టుకోగా.. తాజాగా ‘జోర్ సే..’ అనే సెకండ్ సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మణిశర్మ సంగీతం సమకూర్చగా.. ప్రముఖ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ సాహిత్యం అందించారు. అనురాగ్ కులకర్ణి – సాకీ శ్రీనివాస్ – బరిమిశెట్టి కలసి ఆలపించారు. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జేబీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై భగవాన్, పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు.
మహాసముద్రం: ‘చెప్పకే చెప్పకే’ సాంగ్ మెచ్చిన రష్మిక
Also Read
- సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
- Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన 'రాజా శివాజీ'.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
- Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్‌లతో 'కల్కి 2' భారీ సర్ప్రైజ్!
- Celebrity Wedding : ఖుష్బూ కూతురు పెళ్లి వేడుకలో మెరిసిన టాలీవుడ్ స్టార్స్.. ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్
యంగ్ టాలెంటెడ్ హీరోలు శర్వానంద్ – బొమ్మరిల్లు సిద్ధార్థ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘మహాసముద్రం’. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది. అదితి రావు హైదరి – అను ఇమ్మాన్యుయేల్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజయ్ భూపతి దర్శకత్వం వహించగా.. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రంలోని ‘చెప్పకే చెప్పకే’ అనే మెలోడీ గీతాన్ని బ్యూటీ రష్మిక మందన్నా రిలీజ్ చేసి చిత్ర బృందానికి విషెస్ తెలియజేస్తూ.. ఆల్ ది బెస్ట్ తెలిపింది. ‘ఈ ఫీల్ గుడ్ ప్రేమ పాట నాకు బాగా నచ్చింది. శర్వా ఇటీవల ఈ సినిమా ట్రైలర్ కూడా చూపించారు. అందరూ బాగా నటించారు’ అంటూ రష్మిక పేర్కొంది. చైతన్య భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తుండగా.. జగపతి బాబు, రావు రమేష్, గరుడ రామ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
సమంతకు ముందే.. గర్భంతో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? ప్రసవాన్నే సినిమాలో చూపించారు!
-
QR Code Mandatory on Medicines: ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ఇకపై అసలైన, నకిలీ మందులను క్షణాల్లో గుర్తించొచ్చు!
-
Raja Shivaji OTT: బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టిన ‘రాజా శివాజీ’.. ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్
-
Yash Dayal: యశ్ దయాల్ ‘కమ్‌బ్యాక్’.. ‘పోక్సో’ కేసుల నుంచి విముక్తి!
-
Kalki 2 Update: నాగ్ అశ్విన్ మాస్టర్ ప్లాన్.. రెండు సిరీస్‌లతో ‘కల్కి 2’ భారీ సర్ప్రైజ్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!