‘జాతిరత్నాలు’తో ఒక్కసారిగా అందరిని ఆకట్టుకుంది ఫరియా అబ్దుల్లా. ఇందులో చిట్టి పాత్రలో మెప్పించింది. చిట్టి పాటతో పాపులర్ అయిన ఈ భామ గ్లామర్ విషయంలో ఏమాత్రం తగ్గేలా లేదు. యూట్యూబ్ స్టార్‌గా వెలిగిన ఈ బ్యూటీ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో కుర్రాళ్లని మాయ చేస్తూనే ఉంది. ఇక సైడ్ బిజినెస్ లోను చిట్టి దూకుడు చూపిస్తోంది. ఒక్క సినిమాతోనే విపరీతమైన అభిమానులను సొంతం చేసుకున్న ఈ బ్యూటీ సీనియర్ యాక్టర్స్ తో సమానంగా షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. తాజాగా సికింద్రాబాద్ లోని ప్యాట్నీలో ఓ బ్రాండ్ మండి స్టోర్ ను ప్రారంభించింది. చిట్టి వస్తుందని తెలిసి అభిమానులు ఎక్కువగా వచ్చారు. ప్రస్తుతం ఈ బ్యూటీకి మరిన్ని సినిమా ఆఫర్లు వస్తున్నాయి.