Winter Hair Care Tips: చలికాలం రాగానే ముఖం, చేతులు మాత్రమే కాదు.. జుట్టు సైతం ఇబ్బందులు పెడుతుంది. చల్లగాలులు వీచే ఈ సమయంలో స్కాల్ప్‌లోని తేమ తగ్గిపోవడంతో వెంట్రుకలు పొడిబారిపోతాయి. కుదుళ్లు బలహీనపడతాయి. ఫలితంగా జుట్టు రాలిపోవడం, కొసలు చిట్లిపోవడం, చుండ్రు పెరగడం వంటి సమస్యలు ఎక్కువైపోతాయి. అందుకే ఈ సీజన్‌లో జుట్టు సంరక్షణకు కొంచెం అదనపు శ్రద్ధ పెట్టాల్సిందే. చలికాలంలో ఎక్కువ మంది చేసే పొరపాటు తరచుగా తలస్నానం చేయడం. దీని వల్ల స్కాల్ప్‌లోని సహజనూనెలు పోయి జట్టంతా ఇంకా పొడిగా మారుతుంది. వారానికి రెండుసార్లు మాత్రమే తలస్నానం చేయడం మంచిది. షాంపూ కూడా స్కాల్ప్‌కు గెంటిల్‌గా ఉండేదే వాడాలి. షాంపూ చేసే ముందు కండిషనర్ లేదా కొంచెం నూనె రాసుకుంటే రసాయనాల ప్రభావం తగ్గుతుంది. అలాగే బాగా వేడి నీటితో తలస్నానం చేయడం తప్పించుకోవాలి. గోరువెచ్చని నీరు జుట్టు ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
READ MORE: Amala : తన బాల్యం, పుట్టింటి గురించి మొదటిసారిగా ఓపెన్ అయిన అమల – ఎన్నో తెలియని సంగతులు బయటకు!
వెంట్రుకలు ఊడిపోకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు నూనె పెట్టుకోవడం చాలా మంచిది. కొబ్బరి నూనె, బాదం నూనె, ఆలివ్ ఆయిల్ వంటి సహజ నూనెలు స్కాల్ప్‌కి తేమను అందించి కుదుళ్లను బలపరుస్తాయి. తడి జుట్టుతో బయటకు వెళ్లడం కూడా మంచిది కాదు. గాలిలో ఉన్న దుమ్ము, అలర్జీ కారకాలు వెంట్రుకలకు అంటుకుని మరింతగా బలహీనపరుస్తాయి. కొంత మంది స్టైలింగ్ కోసం డ్రయర్లు, స్ట్రయిటనర్లు, కర్లర్లు ఎక్కువగా వాడుతుంటారు. ఇవి వేడిని ఇస్తాయి కాబట్టి చలికాలంలో జుట్టును ఇంకా బలహీనపరుస్తాయి. వీటిని వీలైనంత వరకు దూరం పెట్టి సహజంగా ఆరబెట్టుకోవడం ఉత్తమం. జుట్టు కుదుళ్లకు బలం రావాలంటే ఆహారంలో కూడా పోషకాలు ఉండాలి. విటమిన్ A, E, జింక్, బయోటిన్ వంటి పోషకాలు ఉన్న ఆహారాలు వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ పోషకాలు స్కాల్ప్‌లో రక్త ప్రసరణను పెంచి సీబం ఉత్పత్తిని సరిచేస్తాయి. జుట్టు సంరక్షణ కోసం ఇంట్లోనే ఒక పోషక మాస్క్ తయారు చేసుకోవచ్చు. పెరుగు, గుడ్డు, అరటి పండు, ఆలివ్ నూనె, నిమ్మరసం, విటమిన్ E క్యాప్సూల్ కలిపి తయారుచేసే ఈ మిశ్రమం జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది. తలస్నానం తర్వాత ఈ మాస్క్‌ను కుదుళ్ల వరకు రాసుకుని ఇరవై నిమిషాల తర్వాత శుభ్రం చేస్తే జుట్టు నిగారింపు, బలం పెరుగుతాయి.
READ MORE: Pratyusha Suicide Case: సినీ నటి ప్రత్యూష సూసైడ్ కేసులో కీలక పరిణామం..