Cracked Heels Home Remedies: చలికాలం మొదలైతే చాలామందిని ఎక్కువగా ఇబ్బంది పెడే సమస్య మడమల పగుళ్లు. చర్మం పొడిగా మారటం, తేమ తగ్గిపోవడం, వయసుతో చర్మం పలచబడటం మరిన్ని ఇతర కారణాలతో మడమలు గట్టిపడి పగుళ్లు పడతాయి. కొందరికి అయితే రక్తం వచ్చేంతగా పగుళ్లు తీవ్రమవుతాయి. నొప్పి, కాలుతున్నట్టుగా అనిపించడం, నడవడానికే ఇబ్బంది పడటం ఇలా అనేక సమస్యలు వస్తుంటాయి. కానీ కొంచెం జాగ్రత్తలు, ఇంట్లోనే చేసే చిన్న రెమెడీలతో ఈ సమస్యను సులభంగా నియంత్రించుకోవచ్చు.
READ MORE: Diabetes Control Tips: :చలికాలంలో షుగర్ కంట్రోల్ లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా..
మొదట పాదాలను శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. రోజులో ఒకసారి గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, ఉప్పు, సబ్బు వేసి పాదాలను 10–15 నిమిషాలు నానబెడితే చర్మం మృదువవుతుంది. తర్వాత ప్యూమిస్ స్టోన్ లేదా ఫుట్ ఫైల్‌తో నెమ్మదిగా రుద్దితే డెడ్ స్కిన్ తొలగిపోతుంది. ఇలా చేస్తూ పాదాలను పరిశుభ్రంగా ఉంచితే పగుళ్లు మరింత పెరగకుండా ఆపవచ్చు. అంతేకాదు.. మాయిశ్చరైజింగ్ చాలా అవసరం. పెట్రోలియం జెల్లీ, కొబ్బరి నూనె, షియా బటర్ వంటి మందపాటి క్రీములను రాత్రి పడుకునేటప్పుడు పాదాలకు బాగా రాసి, సాక్స్ వేసుకుని నిద్రపోతే ఉదయం పాదాలు మృదువుగా మారతాయి. గ్లిజరిన్, రోజ్‌వాటర్ మిశ్రమం కూడా మంచి ఫలితం ఇస్తుంది. ఇవి చర్మానికి తేమను ఇచ్చి పగుళ్లు తగ్గిస్తాయి.
READ MORE: HYD: దాంపత్యాలు విచ్ఛిన్నం అవుతున్నాయి – నెలకు 250 విడాకుల కేసులు
ఇంట్లోనే ఉండే పదార్థాలతో చేసే కొన్ని ప్రభావవంతమైన రెమెడీలు కూడా ఉన్నాయి. వేప ఆకుల పేస్ట్‌కు కొంచెం పసుపు కలిపి పగుళ్లపై రాసితే ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అలాగే పండిన అరటిపండు, అవకాడోతో చేసిన ఫుట్‌మాస్క్ చర్మానికి మెత్తదనాన్ని ఇస్తుంది. కొబ్బరి నూనెతో మసాజ్ చేయడం కూడా పగుళ్లను త్వరగా తగ్గిస్తుంది. చర్మం పొడిబారకుండా ఉండాలంటే పాదాలను ఎప్పుడూ తేమగా ఉంచుకోవాలి. బయటకు వెళ్లేటప్పుడు సాక్స్ వేయడం, చాలా గట్టిగా లేదా చాలా వదులుగా ఉన్న చెప్పులు ధరించకపోవడం మంచిది. రాళ్లు, కంకర మీద చెప్పులు లేకుండా నడవడం పగుళ్లను మరింత పెంచుతుంది కాబట్టి దాని నుంచి దూరంగా ఉండాలి. ఇలా రోజూ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో వచ్చే మడమల పగుళ్ల నుంచి ఉపశమనం పొందొచ్చు.