Eating Rice: అన్నం తిన్నాక వెంటనే నిద్ర వస్తుందా? అసలు కారణం ఇదే!
- అన్నం తిన్న వెంటనే నిద్ర వస్తుందా..?
- షుగర్ లెవల్స్ కారణంగా అలసట, నిద్రమత్తు..
- సెరొటోనిన్, మెలటోనిన్ వల్ల మత్తు..
- ప్రొటీన్, ఫైబర్ ఫుడ్ కూడా తీసుకుంటే మంచిది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Eating Rice: సాధారణంగా మనం అన్నం తిన్న వెంటనే నిద్ర వస్తుందనే వ్యక్తుల్ని చూస్తుంటాం. ఇది మనకు కూడా ఒక్కో సందర్భంలో అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అన్నం తిన్న వెంటనే కళ్లకు భారం అనిపించడం, పనిచేయాలనే ఉత్సాహం తగ్గడం, అలసటగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా తిన్న వెంటనే శక్తి అందాలి కానీ, అలసట ఎందుకు వస్తుందని సాధారణంగా అందర్ని వేధించే ప్రశ్న. దీని వెనకు చాలా పెద్ద సైన్స్ దాగి ఉంది.
సాధారణంగా తెల్లని బియ్యంతో వండిన అన్నం తిన్న వెంటనే మన శరీరంలో మెటబాలిజం ఒక్కసారిగా ఒత్తిడిని ఎదుర్కొంటుంది. తెల్ల బియ్యానికి ‘‘గ్లైసిమిక్ ఇండెక్స్’’ చాలా ఎక్కువ. దీంతో ఇది త్వరగా జీర్ణమై, రక్తంలో గ్లూకోజ్‌గా మారి షుగర్ లెవల్స్‌ను ఒక్కసారిగా పెంచుతాయి. దీనిని బ్యాలెన్స్ చేయడానికి ఇన్సులిన్ కూడా పెరుగుతుంది. ప్రారంభంలో ఇది శక్తిని అందిస్తుంది, కానీ కొంత సమయం తర్వాత, ఈ శక్తి అకస్మాత్తుగా తగ్గిపోతుంది. అందుకే చాలా మంది అలసటగా, నిద్రమత్తుగా భావిస్తారు. ఇది శరీరంలో త్వరగా జీర్ణమై, రక్తంలో చక్కెరను వేగంగా పెంచుతుంది. చక్కెర స్థాయిలు వేగంగా పెరిగిన తర్వాత పడిపోయినప్పుడు, శరీరం నీరసంగా అనిపించవచ్చు.
Also Read
- Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
- Mouth Ulcer Causes: నోటి పూత తగ్గడం లేదా? ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.. డాక్టర్ల హెచ్చరిక
- Homemade Olive Oil: ఖరీదైన ఆలివ్ ఆయిల్‌కు గుడ్‌బై.. ఇంట్లోనే తయారు చేసుకునే సింపుల్ పద్ధతి ఇదే!
- Door Lock Care Tips: వానలకు మీ ఇంటి తాళాలు పాడవుతున్నాయా? ఈ సింపుల్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మెరిపించండి!
ఈ ప్రక్రియలో ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ మెదడుకు ఎక్కువగా చేరుతుంది. ఇది సెరోటినిన్, మెలటోనిన్ వంటి హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్లు మన మానసిక స్థితి, నిద్రను నియంత్రిస్తుంటాయి. అందుకే అన్నం తిన్న తర్వాత విశ్రాంతి తీసుకోవాలనిపించడం, నిద్ర పోవాలని అనిపించడం జరుగుతుంది.
ఒకేసారి ఎక్కువ పరిమాణంలో అన్నం తినడం, హెవీ మీల్స్ తీసుకోవడం మన జీర్ణ వ్యవస్థపై అదనపు భారం పెడుతుంది. దీంతో ఎక్కువ శక్తిని జీర్ణక్రియ కోసం వినియోగించి అలసట ఏర్పడుతుంది. ఈ సమస్యను తగ్గించుకోవాలంటే మితంగా అన్నం తీసుకోవాలి. ప్రొటీన్ ఫుడ్ అంటే ఎగ్స్, చికెన్, పనీర్, పప్పులు ఆహారంలో భాగంగా ఉండాలి. దీంతో పాటు ఫైబర్ రిచ్ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి. అన్నం తిన్న 10-15 నిమిషాల తర్వాత 15-30 నిమిషాలు నడవడం మంచిదని వైద్యులు చెబుతుంటారు.
తాజావార్తలు
-
Amit Shah: 1937 నిర్ణయంతోనే విభజనకు పునాది.. ‘వందే మాతరం’ను విభజించిన తప్పును మళ్లీ చేయొద్దు.. కాంగ్రెస్‌పై అమిత్ షా ఫైర్
-
YS Jagan: డీఎస్సీ అక్రమాలకు అక్కడే బీజం పడింది.. సీబీఐ విచారణ జరపాలి.. లోకేష్ రాజీనామా చేయాలి!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Sai Abhyankkar: ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ పేరుతోనే పాట.. సాయి అభ్యంకర్ ‘రాధిమా’ వెనుక అసలు కథ ఇదే!
-
Youtube Videos: రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేస్తే లక్ష రూపాయలు… క్రియేటర్లకు పండగలాంటి వార్త చెప్పిన ప్రభుత్వం..
ట్రెండింగ్
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!