మన ఆరోగ్యకరమైన జీవితం ప్రధానంగా ఉదయం తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కానీ చాలా మంది పని ఒత్తిడిలో ఉదయం అల్పాహారం చేయకుండా ఇంటి బయటకు వెళ్లిపోతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అల్పాహారం చేయకపోవడం వల్ల జీవక్రియ (మెటబాలిజం) దెబ్బతింటుంది. దీని కారణంగా బొడ్డుపై కొవ్వు పెరగడం, అధిక రక్తపోటు, అధిక రక్త చక్కెర, చెడు కొలెస్ట్రాల్ వంటి సమస్యలు ఒకేసారి తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ అలవాటు ఆరోగ్యానికి ఎంతగానో హానికరమని వైద్యులు చెబుతున్నారు. అందుకే ఉదయాన్నే అల్పాహారం చేయకుండా బయటకు వెళ్లకూడదని వారు సూచిస్తున్నారు.
కొంతమంది ఇంట్లో అల్పాహారం చేయకుండా బయట దొరికే ఫుడ్ లేదా స్ట్రీట్ ఫుడ్ తిని కడుపు నింపుకుంటారు. ఇది మరింత ప్రమాదకరం, ఎందుకంటే ఆహారంలోని గుణనిర్ణయం, పరిశుభ్రతపై నమ్మకం ఉండదు.వైద్య నిపుణుల ప్రకారం, మీరు ఉదయం తీసుకునే అల్పాహారమే ఆ రోజు మొత్తం మీ శక్తి, ఉత్సాహాన్ని నిర్ణయిస్తుంది.అందువల్ల మీరు తినే ఆహారంలో పోషకాలు సమృద్ధిగా ఉండేలా చూసుకోవాలి. ఇది రోజంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండేందుకు సహాయపడుతుంది.అదేవిధంగా, సరైన అల్పాహారంతో పాటు తాజా పండ్ల రసాలు లేదా న్యూట్రిషన్ కలిగిన జ్యూసులు తీసుకోవడం కూడా శక్తిని పెంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు.