కొత్త పరిశోధనల ప్రకారం ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్య కేవలం ఊబకాయం లేదా ఆల్కహాల్ సేవించడం వల్ల మాత్రమే కాకుండా విటమిన్ B12 లోపంతో రావచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది ఇప్పటి వరకు పెద్దగా పట్టించుకోని ఒక ముఖ్యమైన గుప్త కారణంగా గుర్తించబడిందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అియితే.. బి12 లోపం ఎందుకు ప్రమాదకరమో నిపుణులు వెల్లడించారు. విటమిన్ B12 శరీరంలోని కొవ్వును సరైన రీతిలో విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. B12 సరైన మోతాదులో లేకపోతే కాలేయం కొవ్వును సరిగా ప్రాసెస్ చేయలేకపోతుందని తెలిపారు. దీంతో అదనపు కొవ్వు కాలేయంలో పేరుకుపోతుంది.వాపు పెరుగుతుంది.దీనివలన దీర్ఘకాలంలో కాలేయం దెబ్బతినే ప్రమాదం పెరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అనేక అధ్యయనాల్లో NAFLD (Non-Alcoholic Fatty Liver Disease) ఉన్నవారిలో B12 స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా ఫ్యాటీ లివర్ నేడు అత్యంత వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో ఒకటి. చాలామంది ఇది
అతిగా తినడం, ఊబకాయం, ఆల్కహాల్ వినియోగం వల్ల ఫ్యాటీ లివర్ పెరుగుతుందని నిపుణులు తెలిపారు
అయితే కేవలం వీటి వల్లే ఫ్యాటీ లివర్ వస్తుందని అంతా అనుకుంటున్నారు. కానీ తాజా పరిశోధనల ప్రకారం, విటమిన్ B12 లోపం కూడా ఒక ప్రధాన పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
బి12 లోపాన్ని ముందుగా గుర్తించి చికిత్స ప్రారంభిస్తే కాలేయం నష్టాన్ని నివారించవచ్చని నిపుణులు తెలిపారు. కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుందని తెలిపారు. దీంతో కాలేయ నష్టాన్ని నివారించవచ్చన్నారు.కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుంది. ఫ్యాటీ లివర్ తీవ్రత తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి, అలసట, బలహీనత, జీర్ణ సమస్యలు, నరాల సమస్యలు వంటి లక్షణాలు కనిపించినప్పుడు B12 స్థాయిలను పరీక్షించుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు.