Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Hacks: రోజూ వంటగదిలో గంటల తరబడి పనిచేసి అలసిపోతున్నారా? ఎంత కష్టపడినా పనులు త్వరగా పూర్తి కావడం లేదా? అయితే వంటగదిలో కేవలం కష్టపడటమే కాదు.. కాస్త స్మార్ట్‌గా ఆలోచించడం కూడా ముఖ్యం. మనకు తెలియని కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల వంట పని ఎంతో సులువు అవ్వడమే కాకుండా, సమయం కూడా చాలా ఆదా అవుతుంది. గృహిణుల శ్రమను తగ్గించి, వంటగది పనులను చిటికెలో పూర్తి చేసే అద్భుతమైన, ఉపయోగకరమైన కిచెన్ టిప్స్‌ను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
* వంటగదిలో గిన్నెలు కడిగిన తర్వాత స్టాండ్ కింద నీరు చేరి ప్లాట్‌ఫామ్‌పై తెల్లటి గట్టి మరకలు పడుతుంటాయి. మార్బుల్ లేదా గ్రానైట్ రాయి ఏదైనా సరే.. ఈ మరకలపై కొద్దిగా శానిటైజర్ (Sanitizer) స్ప్రే చేసి, కిచెన్ టవల్‌తో తుడిస్తే నిమిషాల్లో క్లీన్ అయిపోతుంది.
Also Read
- Kitchen Cleaning Tips: కొత్త పాత్రలపై ఉన్న మొండి స్టిక్కర్స్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో నిమిషాల్లో క్లీన్!
- Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
- Ragi Burelu: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. సాంప్రదాయ పద్ధతిలో ‘రాగి బూరెలు’ ఎలా చేయాలో తెలుసా?
- Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
* డై లేదా మెహందీ పెట్టుకునేటప్పుడు చేతులకు వేసుకునే ప్లాస్టిక్ గ్లౌజెస్ లూజ్‌గా ఉండి జారిపోతుంటాయి. అలాంటప్పుడు మణికట్టు భాగంలో ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే గ్లౌజ్ చేతికి టైట్‌గా ఉండి పనులు చేసుకోవడానికి కంఫర్టబుల్‌గా ఉంటుంది.
* అల్యూమినియం కుక్కర్లో బంగాళాదుంపలను ఉడికించినప్పుడు కుక్కర్ లోపల నల్లగా మారుతుంది. అలా జరగకుండా ఉండాలంటే నీటితో పాటు కొద్దిగా ఉప్పు వేయాలి. దీనివల్ల రెండు లాభాలు ఉన్నాయి.. ఒకటి కుక్కర్ నల్లబడదు, రెండు ఆలుగడ్డలు పగలకుండా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి.
* రాత్రి వండిన పప్పు మిగిలిపోతే దాన్ని పారేయకుండా లేదా మళ్లీ అదే తినకుండా రెండు రకాలుగా వాడుకోవచ్చు. అందులో ఒకటి ఓట్స్ దాల్: పప్పులో కొద్దిగా నీరు, ఉప్పు వేసి మరిగించి, అందులో రెండు మూడు చెంచాల ఓట్స్ వేసి 2 నిమిషాలు ఉడికిస్తే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెడీ అవుతుంది. ఇలా కాకుండా పప్పు అట్లు (చీలా) కూడా చేసుకోవచ్చు. దీని తయారి ఎలా అంటే.. రాత్రి మిగిలిన పప్పులో కొద్దిగా నీరు, ఉప్పు కలిపి బ్లెండ్ చేసి అట్ల పిండిలా తయారుచేసుకోవాలి. దీన్ని పెనంపై కాస్త మందంగా వేసి, మూత పెట్టి రెండు వైపులా కాల్చుకుంటే టేస్టీ చీలా రెడీ అవుతుంది.
* ఎక్కువ మొత్తంలో పచ్చిమిర్చి తొడిమలు తీసేటప్పుడు చేతులు మంట పుడుతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే చేతులకు కొద్దిగా వంట నూనె (ఆయిల్) రాసుకుని తొడిమలు తీయాలి. ఒకవేళ అప్పటికీ చేతులు మండుతుంటే, ఫ్రిజ్‌లో ఉన్న చల్లటి పాలు చేతులకు రాసుకుంటే మంట వెంటనే తగ్గిపోతుంది.
* సమోసాలు పర్ఫెక్ట్గా, క్రిస్పీగా వేగాలంటే ముందుగా స్టవ్ లో-ఫ్లేమ్‌లో (తక్కువ మంటపై) 12 నుంచి 13 నిమిషాల పాటు రెండు వైపులా నిదానంగా వేయించాలి. చివరి 1 నిమిషం మాత్రం హై-ఫ్లేమ్‌లో ఉంచి తీసేస్తే బయట స్వీట్ షాప్‌లో దొరికేలా కరకరలాడుతూ వస్తాయి.
* పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలను కడిగి కట్ చేసిన తర్వాత కూడా అందులో ఇసుక మిగిలిపోతుంటుంది. అలాంటప్పుడు ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి ఆకుకూరలను అందులో వేసి 15-20 నిమిషాల పాటు కదపకుండా వదిలేయాలి. అప్పుడు మట్టి అంతా గిన్నె అడుగుకు చేరుకుంటుంది. పైపైన ఉన్న ఆకుకూరలను సులువుగా వేరు చేసుకోవచ్చు.
* మైదా పిండిలో జీలకర్ర, వాము, మిరియాల పొడి, కలంజీ, ఉప్పు, కరిగించిన నెయ్యి వేసి బాగా కలపాలి. పిండి ముద్దలా అయ్యేలా చూసుకుని కొద్దిగా నీటితో గట్టిగా కలుపుకోవాలి. మూడు చపాతీలను చేసి, వాటి మధ్య మైదా, నెయ్యి కలిపిన మిశ్రమం (Slurry) రాసి ఒకదానిపై ఒకటి పెట్టి రోల్ చేయాలి. దీన్ని చతురస్రాకారంలో మడిచి, ముక్కలుగా కట్ చేసి తక్కువ మంటపై 10-12 నిమిషాలు వేయిస్తే ఎంతో రుచికరమైన, పొరలు పొరలుగా ఉండే స్నాక్స్ (నమక్ పారే) రెడీ అవుతాయి. వీటిని నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
-
UP: ‘నాకు విడాకులు ఇచ్చేయండి’.. ఓ వింతైన కారణంతో కోర్టుకెళ్లిన నూతన వధువు
-
Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
-
Carlsberg IPO: ప్రపంచంలోనే అత్యంత పురాతన బియర్ బ్రాండ్ ఐపీఓ.. వివరాలు ఇవే!
-
Mohammed Siraj: ముల్లన్పూర్ టెస్టులో ఘర్షణ.. అఫ్గానిస్థాన్ బ్యాటర్‌పై ఆగ్రహంతో ఊగిపోయిన సిరాజ్..
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!