Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tulsi Plant Vastu Tips: ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం అనేది కేవలం పూజలకు, భక్తికే పరిమితం అనుకుంటే పొరపాటే! వాస్తు శాస్త్రంలో కూడా తులసికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది ఇంట్లో ఉంటే ఆ వాతావరణంలో ప్రతికూల శక్తి తగ్గి, పాజిటివ్ ఎనర్జీ నిండుతుందనేది ప్రతి ఒక్కరి నమ్మకం. సరియైన దిశలో, సరైన పద్ధతిలో తులసి మొక్కను పెంచితే ఇంట్లో ప్రశాంతత, సంతోషంతో పాటు సిరిసంపదలు కూడా వెల్లివిరుస్తాయి. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఈ పవిత్రమైన మొక్క ద్వారా ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి వాస్తులో కొన్ని విశేషమైన చిట్కాలు చెప్పారు.
ముందుగా తులసి మొక్కను ఇంట్లో ఏ వైపు పెట్టాలనేది చాలా ముఖ్యం. వాస్తు ప్రకారం ఈశాన్యం (ఉత్తర-తూర్పు) మూలన గానీ, లేదా తూర్పు దిశలో గానీ తులసి చెట్టును నాటడం అత్యంత శుభకరం. ఎందుకంటే ఈ దిశల నుంచి సానుకూల శక్తి ఎక్కువగా ప్రసరిస్తుంది. అలాగే మొక్కను ఎప్పుడూ గాలి, వెలుతురు సరిగ్గా తగిలేలా పరిశుభ్రమైన ప్రదేశంలోనే ఉంచాలి. ఇక, ధనానికి, ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిన ఒక సులువైన చిట్కా కూడా ఉంది. తులసి చెట్టుకు సంబంధించిన ఎండిపోయిన కొన్ని ఆకులను తీసుకొని, ఒక ఎర్రటి గుడ్డలో జాగ్రత్తగా మూటకట్టాలి. ఆ మూటను మనం ఇంట్లో డబ్బులు దాచుకునే బీరువాలో గానీ, లేదా ముఖ్యమైన కాగితాలు ఉంచే ప్రదేశంలో గానీ పెడితే ఆర్థికంగా కలసివస్తుందని చెప్తారు.
Also Read
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Probation Period Rules: జాబ్లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
- Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం వేళల్లో తులసి కోట ముందు దీపం వెలిగించడం మన సాంప్రదాయంలో చాలా కాలంగా వస్తున్న ఆచారం. అలా క్రమం తప్పకుండా పూజ చేసి దీపం పెట్టడం వల్ల ఇల్లు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు. ఉదయాన్నే తులసి చెట్టుకు నీళ్ళు సమర్పించేటప్పుడు ‘ఓం శ్రీం’ అనే మంత్రాన్ని జపించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ మంత్రం శ్రీమహావిష్ణువుకు ప్రియమైన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అయితే ఇవన్నీ మన నమ్మకం, భక్తి మీద ఆధారపడి పనిచేస్తాయి. తులసిని ఇంట్లో పెంచేటప్పుడు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొక్క ఉండే పరిసరాలను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఎండిపోయిన లేదా వాడిపోయిన తులసి మొక్క ఉండటం మంచిది కాదని వాస్తు చెప్తోంది. ఒకవేళ మొక్క పూర్తిగా ఎండిపోతే, దాన్ని గౌరవప్రదంగా తొలగించి, ఆ స్థానంలో మరో కొత్త పచ్చని తులసి మొక్కను నాటుకోవాలి. ఇక, హిందూ సాంప్రదాయంలో తులసికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావించే ఈ మొక్కను పూజించడం వల్ల దైవానుగ్రహం దక్కడమే కాకుండా, ఇంట్లోకి లక్ష్మీదేవి నడచి వస్తుందని, అష్టైశ్వర్యాలు కలుగుతాయని అందరూ విశ్వసిస్తారు.
తాజావార్తలు
-
Tulsi Plant: ఇంట్లో తులసి మొక్క ఉందా? పాజిటివ్ ఎనర్జీ, సిరిసంపదలు రావాలంటే ఈ టిప్స్ పాటించండి
-
UPIకి షాక్.. కొత్త MDRపై సర్వేలో ఆసక్తికర విషయాలు.. మళ్లీ పాత రోజులే..!
-
Nora Fatehi : జైలర్2లో స్పెషల్ సాంగ్.. అందాల విందు చేసి ఆరబోసిన నోరాఫతేహీ
-
Srikanth Odela: శ్రీకాంత్ ఓదెలపై నమ్మకం ఉంటుందా?.. నెక్ట్స్ హీరో ఎవరు?
-
Huawei Mate 90 Pro Max: హువావే Mate 90 Pro Max లాంచ్.. 200MP RYYB కెమెరా, 6,800mAh బ్యాటరీ, 6.9 అంగుళాల డిస్ప్లే
ట్రెండింగ్
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్కు రెడీ..!