Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rainy Season Kitchen Tips : వర్షాకాలంలో వాతావరణంలో తేమ శాతంతో పాటు ఉష్ణోగ్రతలు మారడం వల్ల ఇంట్లో నిల్వ ఉంచిన బియ్యంలో ఉండలు కట్టడం, చిన్న గోధుమ రంగు వరి పురుగులు లేదా నులిపురుగులు చేరడం సాధారణంగా జరుగుతుంటుంది. బియ్యంలో పురుగులు కనిపిస్తే చాలామంది వాటిని పారబోస్తుంటారు. కానీ సరైన పద్ధతుల్లో శుభ్రం చేసుకుంటే ఆ బియ్యాన్ని సురక్షితంగా మళ్లీ ఉపయోగించుకోవచ్చు.
అసలు బియ్యంలోకి పురుగులు ఎలా వస్తాయి.?
ఆడ వరి పురుగు బియ్యపు గింజ మధ్య భాగంలో ఒక చిన్న రంధ్రం చేసి అందులో గుడ్డు పెట్టి, బయటకు కనిపించకుండా ప్రత్యేక పదార్థంతో కప్పివేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఆ గుడ్డు నుంచి లార్వా బయటకు వచ్చి గింజను లోపల నుంచి తింటూ పెరుగుతుంది. దీంతో పైకి గింజ బానే ఉన్నప్పటికీ లోపల బోలుగా మారిపోతుంది. క్రమంగా అది పూర్తిగా పెరిగిన పురుగుగా బయటకు వచ్చేసరికి బియ్యపు గింజ పొడిపొడిగా రాలిపోతుంది. కొనుగోలు చేసిన ప్యాకెట్లలోనూ తేమ లేదా వేడి తగిలినప్పుడు గింజల్లోని గుడ్లు పొదిగి పురుగులుగా మారతాయి. బియ్యంలో చిన్న గుండ్రని రంధ్రాలు, డబ్బా అడుగున పొడి, లేదా వింత వాసన వస్తుంటే పురుగులు ఉన్నాయని గుర్తించాలి.
Also Read
- Rainy Season Fridge Tips: వర్షాకాలంలో ఫ్రిజ్ ఇలా వాడండి.. కరెంట్ బిల్లు కూడా తగ్గుతుంది.!
- Water Manifestation Technique: "నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్" అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
- Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
- Silver Cleaning Tips: వెండి పాత్రలు, ఆభరణాలు నల్లబడ్డాయా?.. ఇంట్లోనే మెరిపించే ఈజీ టెక్నిక్ ఇదే
ఎండలో పెట్టడం , ఫ్రీజింగ్ పద్ధతి
బియ్యంలో పురుగుల బెడద కనిపిస్తే ముందుగా వాటిని ఒక పెద్ద పళ్ళెంలో పరచి 15 నుంచి 20 నిమిషాల పాటు నల్లటి ఎండలో ఉంచాలి. సూర్యరశ్మి వేడికి పురుగులు బయటకు వచ్చేస్తాయి. ఆ తర్వాత సన్నని జల్లెడతో జల్లించి చెత్తను, పురుగులను వేరు చేయాలి. పురుగులను , వాటి గుడ్లను పూర్తిగా నివారించడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గం ఏమిటంటే, జల్లించిన బియ్యాన్ని ఒక 48 గంటల పాటు ఫ్రీజర్‌లో ఉంచడం. దీనివల్ల గింజల లోపల దాగి ఉన్న లార్వాలు, గుడ్లు నశిస్తాయి.
సహజసిద్ధమైన చిట్కాలు , నివారణ మార్గాలు
బియ్యంలో మళ్లీ పురుగులు చేరకుండా ఉండటానికి మన ఇంట్లో లభించే సహజ పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి. బియ్యం నిల్వ చేసే డబ్బాలో 3 నుంచి 5 వరకు బిర్యానీ ఆకులు, ఎండిన వేప ఆకులు, లవంగాలు లేదా వెల్లుల్లి రెబ్బలను వేయవచ్చు. వీటి ఘాటైన వాసన పురుగులను దరిచేరనీయకుండా నిరోధిస్తుంది. వీటితో పాటు ఎండు మిరపకాయలు , పసుపును కూడా ఉపయోగించవచ్చు. ముఖ్యంగా బియ్యాన్ని ఎల్లప్పుడూ తేమ తగలని పొడి ప్రదేశంలో, గాలి చొరబడని ఎయిర్ టైట్ డబ్బాల్లో మాత్రమే నిల్వ చేయాలి. సంచుల్లో లేదా ప్లాస్టిక్ కవర్లలో వదిలేయకూడదు.
వండే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బియ్యాన్ని వండే ముందు కనీసం మూడుసార్లు శుభ్రంగా కడగాలి. మొదటి రెండుసార్లు చల్లటి నీటితో కడిగిన తర్వాత, మూడోసారి గోరువెచ్చని నీటితో కడిగితే మిగిలి ఉన్న పురుగులు లేదా కంటికి కనిపించని చెత్త పూర్తిగా తొలగిపోతుంది. మార్కెట్ నుంచి కొత్తగా బియ్యం తెచ్చిన వెంటనే కూడా ఒకసారి ఎండలో ఆరబెట్టి, ఆ తర్వాతే ఎయిర్ టైట్ కంటైనర్లలో నిల్వ చేసుకోవడం వల్ల ధాన్యం చాలా కాలం పాటు తాజాగా ఉంటుంది.
తాజావార్తలు
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
CJP Protest: జంతర్ మంతర్ వద్ద సంచలనం.. పోలీస్ కానిస్టేబుల్ రాజీనామా..
-
New Railway Lines: ఏపీకి కేంద్రం వరాల జల్లు.. అదనంగా రెండు రైల్వే లైన్లు.. ఎక్కడ నుంచి ఎక్కడికంటే..
-
Vaibhav Batting: ‘నా బౌలింగ్‌లో చితక్కొట్టాడు భయ్యా.. వైభవ్‌కు బౌలింగ్ వేయలేను’..
-
Dhruv Vikram: హీరోపై ఫిల్మ్ ఛాంబర్లో నిర్మాతల ఫిర్యాదు
ట్రెండింగ్
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్‌ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!