Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Japanese Kitchen Cleaning Tips: ఉదయం లేవగానే వంటింట్లో పాత్రలు కుప్పలు కుప్పలుగా కనిపిస్తే ఎవరికైనా చిరాకు రావడం సహజం. రాత్రి వంట పూర్తయ్యాక అలసటతో సింక్‌లో గిన్నెలు, కుక్కర్లు, ప్లేట్లు అలాగే వదిలేస్తుంటాం. దాంతో పొద్దున్నే లేచి టీ తాగే ఓపిక కూడా లేకుండా ఆ గిన్నెలు తోముకోవాల్సి వస్తుంది. పైగా కౌంటర్‌టాప్ అంతా నీళ్లతో నిండిపోతుంది. కానీ, రాత్రికి రాత్రే మీ వంటిల్లు అద్దంలా మెరిసిపోతూ, సింక్ పొడిగా ఉంటే ఎంత బాగుంటుందో కదా! ఈ సమస్య నుంచి బయటపడటానికి జపాన్ ప్రజలు పాటించే కొన్ని అద్భుతమైన చిట్కాలు చాలా బాగా ఉపయోగపడతాయి. ఎలాంటి ఖర్చు లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా మన వంటింటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకునే ఆ మార్గాలు ఏంటో చూద్దాం.
చాలామంది వంట అంతా పూర్తయ్యాక ఒకేసారి గిన్నెలు తోమడం మొదలుపెడతారు. కానీ జపనీయులు వంట అయ్యేలోపే దొరికే చిన్న చిన్న విరామాల్లోనే పాత్రలను కడిగేస్తుంటారు. కూరగాయలు కోయగానే చాకు, కటింగ్ బోర్డు కడిగేయడం, మసాలాలు కలిపిన గిన్నెలను వెంటనే శుభ్రం చేయడం వల్ల వాటిపై రసాలు, నూనెలు ఎండిపోకుండా ఉంటాయి. ఆ తర్వాత కడగడం కూడా చాలా తేలికవుతుంది. అలాగే గిన్నెలు తోమేటప్పుడు ఒక వరుస క్రమం పాటించడం ముఖ్యమని వారు చెప్తారు. ముందుగా కాస్త తక్కువ జిడ్డు ఉన్న గ్లాసులు, కప్పులు, గిన్నెలను శుభ్రం చేయాలి. ఆ తర్వాత ప్లేట్లు, చివరగా బాగా నూనె, జిడ్డు ఉన్న కడాయిలు లేదా పాత్రలను తోమాలి. దీనివల్ల తోమే పీచుకు జిడ్డు అంటుకుని, మిగతా గిన్నెలకు పాకకుండా ఉంటుంది.
Also Read
- Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
- How to Store Fashion Jewellery: మీ ఫ్యాషన్ జ్యువెలరీ నల్లగా మారుతున్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో మెరిపించండి!
- How To Clean Tiles Lining: టైల్స్ మధ్య నల్లటి మురికి పేరుకుపోయిందా? ఈ క్లీనింగ్ చిట్కాలు పాటించండి
- Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
తిన్న తర్వాత ఖాళీ పాత్రలను ఒకదానిపై ఒకటి పేర్చి పెట్టడం వల్ల అడుగున ఉన్న జిడ్డు, పప్పులు మిగతా గిన్నెలకు అంటుకుని పని ఎక్కువవుతుంది. అందుకే వాడిన గిన్నెలను వేర్వేరుగా ఉంచడం లేదా ఒక ట్రేలో పెట్టి సింక్ దగ్గరికి తీసుకెళ్లడం మంచిది. వంటింట్లో పెద్ద పెద్ద గిన్నెల స్టాండ్లు పెట్టడం వల్ల సగం స్థలం దేనికీ పనికిరాకుండా పోతుంది. దానికి బదులుగా సులువుగా మడిచిపెట్టుకునే స్టాండ్లను వాడవచ్చు. వీటిని సింక్ పైన పరుచుకుని, కడిగిన గిన్నెలు అందులో పెడితే నీళ్లన్నీ నేరుగా సింక్‌లోనే పడతాయి. పని పూర్తయ్యాక దాన్ని మడిచి పక్కన పెట్టేయవచ్చు. గిన్నెలు ఆరడానికి మడిచేందుకు వీలుండే మ్యాట్లను కూడా ఉపయోగించవచ్చు.
గిన్నెలు ఆరడానికి స్టాండ్‌లోనే వదిలేయకుండా, ఒక శుభ్రమైన కాటన్ గుడ్డతో తుడిచి వెంటనే ఆరబెట్టడం జపనీయుల అలవాటు. దీనికోసం వాళ్లు నీటిని త్వరగా పీల్చుకునే ప్రత్యేకమైన కాటన్ టవల్స్ వాడతారు. మన ఇంట్లో ఉన్న మంచి కాటన్ గుడ్డను వాడినా సరిపోతుంది. కడిగిన గిన్నెలను వెంటనే తుడిచి వాటి స్థానాల్లో సర్దేస్తే, కౌంటర్ ఖాళీగా ఉండి వంటిల్లు చూడటానికి ప్రశాంతంగా కనిపిస్తుంది. అన్నింటికంటే ముఖ్యమైనది రాత్రి పడుకునే ముందు సింక్‌ను పూర్తిగా పొడిగా ఉంచడం. పాత్రలన్నీ తోమేశాక సింక్, పైన ఉన్న కుళాయి, కౌంటర్‌ను పొడి గుడ్డతో నీళ్లు లేకుండా తుడవాలి. గిన్నెలు తోమే పీచును బాగా పిండి ఆరేలా పెట్టాలి. ఈ చిన్న అలవాటు చేసుకోవడం వల్ల ఉదయం లేవగానే వంటిల్లు పరిశుభ్రంగా కనిపించడమే కాకుండా, ఉదయమే ఎలాంటి చిరాకు లేకుండా ప్రశాంతంగా టీ, టిఫిన్ తయారు చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
-
Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
-
Noida: ప్రాణం తీసిన మ్యాగీ.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
DDA Karmayogi Awas Yojana: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫ్లాట్లపై 25 శాతం డిస్కౌంట్.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే..!
ట్రెండింగ్
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?
-
Yoo Ji-won: ఫినిషింగ్ లైన్‌కు 500 మీటర్ల దూరంలో కుప్పకూలిన రన్నింగ్ ఇన్ఫ్లుయెన్సర్.. 25 ఏళ్లకే మృతి..!
-
Test Twenty Cricket: క్రికెట్లో సరికొత్త ప్రయోగం.. అమ్మాయిలు, అబ్బాయిలతో 80 ఓవర్ల సరికొత్త ‘టెస్ట్ ట్వంటీ’ టోర్నీకి శ్రీకారం..!
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!