Kitchen Hygiene: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Hygiene: ఇళ్లలో బొద్దింకలు కనిపించగానే చాలా మంది, ముఖ్యంగా మహిళలు చాలా భయపడుతుంటారు. కొందరిలో చిన్నతనంలో బొద్దింకలు ఒంటిపై పడిన చేదు అనుభవాలు జీవితాంతం ఆ భయాన్ని లేదా అసహ్యాన్ని అలాగే ఉంచుతాయి. వైద్య పరిభాషలో బొద్దింకలంటే కలిగే ఈ విపరీతమైన భయాన్ని లేదా విరక్తిని ‘కట్సరిడాఫోబియా’ (Katsaridaphobia) అని అంటారు. అయితే దోమల మాదిరిగా బొద్దింకలు మనుషుల రక్తాన్ని తాగవు కాబట్టి వాటికి నేరుగా భయపడాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి ద్వారా రోగాలు ఎలా వ్యాపిస్తాయి? వీటిని ఇంట్లోకి రాకుండా ఎలా నియంత్రించాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
నిజానికి బొద్దింకల వల్ల వ్యాధులు వస్తాయనే భయం ఈనాటిది కాదు, పురాతన గ్రీస్ కాలం నుంచే ఉందని నిపుణులు అంటున్నారు. ప్రాచీన ఈజిప్షియన్లు సైతం బొద్దింకలను ఇళ్ల నుంచి తరిమేందుకు దేవుళ్లను పూజించేవారని చరిత్ర చెబుతోంది. బొద్దింకల శరీరంలో ‘ట్రోపోమియోసిన్’ (Tropomyosin) అనే ప్రత్యేక ప్రోటీన్ ఉంటుంది. బొద్దింకల మలం, చర్మం, ఇతర శరీర భాగాలలో ఉండే ఈ ప్రోటీన్ కారణంగానే మానవులకు వివిధ రకాల అలర్జీలు వస్తుంటాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి సాధారణంగా మురికి ప్రదేశాలు, చెత్తాచెదారం, టాయిలెట్లలో ఎక్కువగా జీవిస్తాయి కాబట్టే వీటిని చూడగానే విరక్తి కలుగుతుందని వివరించారు.
Also Read
- Rat Control Tips: ఎలుకలకు భయం పుట్టించే ఐదు వాసనలు ఇవే.. సింపుల్ చిట్కాలు ట్రై చేయండి
- Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
- Mamidikaya Pappucharu: 'మామిడికాయ పప్పుచారు' ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
- lizards: ఇంట్లో బల్లుల బెడదా? పైసా ఖర్చు లేకుండా శాశ్వతంగా తరిమికొట్టేందుకు అద్భుతమైన చిట్కాలు ఇవే!
వ్యాధులు ఇలా వ్యాపిస్తాయి
మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు దోమల ద్వారా, కలరా ఈగల ద్వారా నేరుగా వ్యాపిస్తాయి. కానీ బొద్దింకల ద్వారా మనుషులకు నేరుగా ఎలాంటి వ్యాధులూ సంక్రమించవని డాక్టర్లు స్పష్టం చేశారు. అయితే బొద్దింకలు మురికి కూపాల్లోని కుళ్లిన పదార్థాలను తింటాయి కాబట్టి, వాటి శరీరానికి ప్రమాదకర సూక్ష్మజీవులు అంటుకుంటాయని, ఆ తర్వాత ఇవి మన వంటగదిలోకి ప్రవేశించి, మనం తినే ఆహార పదార్థాలపై చేరినప్పుడు ఆ సూక్ష్మజీవులు అన్నంలో కలిసిపోతాయని అన్నారు. ఆ కలుషిత ఆహారాన్ని మనం తినడం వల్ల రోగాల బారిన పడతామని వివరించారు.
బొద్దింకలను ఇంట్లోకి రాకుండా అడ్డుకోవడానికి సింపుల్ చిట్కాలు
ఆహారం, తేమ ఎక్కువగా ఉన్న చోట బొద్దింకలు వేగంగా వృద్ధి చెందుతాయి. కేవలం పరిశుభ్రత పాటించడం ద్వారానే వీటిని పూర్తిగా నియంత్రించవచ్చని పరిశోధకులు సూచిస్తున్నారు. బొద్దింకలను ఇంట్లోకి రాకుండా అడ్డుకోడానికి ఈ సింపుల్ చిట్కాలను పాటించాలని సూచించారు.
* తిన్న ప్లేట్లను సింక్‌లో అలాగే ఉంచకుండా వెంటనే కడగాలి. మిగిలిపోయిన ఆహార వ్యర్థాలను వెంటనే బయట పారేయాలి.
* ఇంట్లో చెత్త పేరుకుపోకుండా చూసుకోవాలి. ఉపయోగించే డస్ట్బిన్లకు కచ్చితంగా మూతలు ఉండాలి. రాత్రి వేళల్లో వాటిని ఇంటి బయట ఉంచడం మంచిది.
* బొద్దింకలు ఎక్కువగా కిటికీలు, తలుపుల సందుల ద్వారానే లోపలికి వస్తాయి. కాబట్టి అవసరం లేనప్పుడు వాటిని మూసి ఉంచాలి.
* ఇళ్లలో ఉండే పాత అట్టపెట్టెలపై దృష్టి పెట్టాలి. ఇవి చెక్క గుజ్జుతో తయారవుతాయి కాబట్టి బొద్దింకలకు ఇవి అద్భుతమైన ఆహారంగా మారుతాయి.
* ఇళ్లలోకి బొద్దింకలు ప్రవేశించడానికి డిష్ వాషర్లు ప్రధాన మార్గాలుగా మారుతున్నాయి. అందుకే రాత్రి పూట వాటిపై ఏదైనా కప్పి ఉంచడం ఉత్తమం అని సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Kitchen Hygiene: ఈ చిన్న చిట్కాలు పాటిస్తే మీ ఇంట్లో ఒక్క బొద్దింక కూడా కనిపించదు!
-
EPFO EDLI Scheme: ఉద్యోగులకు శుభవార్త.. ఒక్క రూపాయి చెల్లించకుండానే రూ.7 లక్షల బీమా..
-
Jagadish Reddy : పవన్ కళ్యాణ్ చదువుతోంది మోడీ రాసిచ్చిన స్క్రిప్ట్
-
Marco Rubio: ఇరాన్ అణు చర్చలపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు.. పశ్చిమాసియా శాంతించేనా?
-
NBK 111: ఈసారి రెగ్యులర్ మాస్ కాదు.. నెక్స్ట్ లెవెల్ ఇంటెన్స్ అవతారంలో ‘గాడ్ ఆఫ్ మాసెస్’!
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్‌తో Itel Aqua లాంచ్.!