Fridge Cleaning Tips: ఇంట్లోనే 5 నిమిషాల్లో తయారయ్యే ఈ నేచురల్ స్ప్రే వాడండి.. మీ ఫ్రిజ్ ఎప్పుడూ తాజాగానే ఉంటుంది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fridge Cleaning Tips: వేసవి కాలంలో ఫ్రిడ్జ్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆహారం త్వరగా పాడవకుండా ఉండేందుకు పాలు, కూరగాయలు, వండిన పదార్థాలు, పండ్లు ఇలా దాదాపు అన్నింటినీ ఫ్రిజ్‌లో నిల్వ చేస్తుంటారు. అయితే తరచుగా ఉపయోగించడం వల్ల ఫ్రిజ్‌లో ఆహార మరకలు, జిగురు, దుర్వాసనలు పేరుకుపోవడం సహజం. సరైన శుభ్రత లేకపోతే ఈ వాసనలు మరింత తీవ్రంగా మారి ఇబ్బంది కలిగిస్తాయి. అయితే, చాలామంది ఫ్రిజ్ ను శుభ్రం చేయడానికి ఖరీదైన క్లీనర్లు కొనుగోలు చేస్తుంటారు. కానీ ఇంట్లో సులభంగా లభించే కొన్ని పదార్థాలతోనే తక్కువ ఖర్చులో అద్భుతమైన నేచురల్ క్లీనింగ్ స్ప్రే తయారు చేసుకోవచ్చు. ఈ స్ప్రే కేవలం 5 నిమిషాల్లో ఫ్రిజ్‌లోని మురికిని తొలగించి, దుర్వాసనను కూడా దూరం చేస్తుంది.
ఇంట్లోనే ఫ్రిజ్ క్లీనింగ్ స్ప్రే ఎలా తయారు చేయాలి?
ఈ నేచురల్ ఫ్రిజ్ క్లీనర్ తయారు చేయడానికి ఎక్కువ పదార్థాలు అవసరం లేదు. ఇంట్లో ఉండే సాధారణ వస్తువులతోనే దీన్ని సులభంగా తయారు చేసుకోవచ్చు.
Also Read
- Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
- Healthy Breakfast: ఎముకలకు ఉక్కు బలమిచ్చే రాగి - మునగాకు రొట్టెలను ఇలా తయారు చేసుకోండి!
- Viral Home Remedy: జ్వరం బిళ్లలతో ఎలుకలు పరార్.. ఇంట్లో ఇవి పెడితే చాలు అస్సలు కనిపించవు!
- Healthy Breakfast: బియ్యం లేకుండానే క్రిస్పీ జొన్న దోశలు.. షుగర్, బరువు నియంత్రణకు హెల్తీ బ్రేక్‌ఫాస్ట్!
అవసరమైన పదార్థాలు:
* 1 కప్పు నీరు
* 1 కప్పు తెల్ల వెనిగర్
* 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం
* ఒక స్ప్రే బాటిల్
ఈ పదార్థాలన్నింటినీ స్ప్రే బాటిల్లో వేసి బాగా కలిపితే మీ సహజ ఫ్రిజ్ క్లీనర్ సిద్ధమైనట్టే.
ఫ్రిజ్‌ను శుభ్రం చేసే సరైన విధానం
ముందుగా ఫ్రిజ్ ప్లగ్‌ను తీసివేసి, అందులో ఉన్న అన్ని వస్తువులను బయటకు తీయాలి. తర్వాత తయారు చేసుకున్న స్ప్రేను ఫ్రిజ్ అరలు, డ్రాయర్లు, గోడలపై సమంగా చల్లాలి. రెండు నిమిషాల పాటు అలాగే ఉంచితే మురికి మెత్తబడుతుంది. ఆ తర్వాత మైక్రోఫైబర్ గుడ్డ లేదా శుభ్రమైన కాటన్ గుడ్డతో ఫ్రిజ్‌ను పూర్తిగా తుడవాలి. ఇలా చేయడం వల్ల మరకలు తొలగిపోవడంతో పాటు ఫ్రిజ్ తాజాగా మెరిసిపోతుంది.
ఫ్రిజ్ దుర్వాసన పోవాలంటే ఈ చిట్కాలు పాటించండి
ఫ్రిజ్‌లో నుంచి ఘాటైన వాసన వస్తుంటే, ఒక చిన్న గిన్నెలో బేకింగ్ సోడా పెట్టి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇది దుర్వాసనను పీల్చుకుని ఫ్రిజ్‌ను తాజాగా ఉంచుతుంది. అలాగే నిమ్మ తొక్కలను కూడా ఫ్రిజ్‌లో ఉంచితే సహజమైన సువాసన వస్తుంది. ఈ చిన్న చిట్కాలు వేసవిలో ఫ్రిజ్‌ను శుభ్రంగా, తాజాగా ఉంచడంలో చాలా ఉపయోగపడతాయి.
తాజావార్తలు
-
Dhanush: సాయిపల్లవికి సపోర్ట్‌గా స్టార్ హీరో.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన ధనుష్!
-
Air Pollution: ఆందోళనకరంగా హైదరాబాద్ వాయు కాలుష్య పరిస్థితి.. ఢిల్లీలో డేంజర్ బెల్స్..
-
Quick Snacks: రాత్రి మిగిలిన చపాతీలతో పైసా ఖర్చు లేకుండా నోరూరించే టిఫిన్! ఇలా చేసేయండి..
-
Captain Farhan Yousaf: భారత్‌పై విజయం సాధించేందుకు ఈ ప్లాన్ వేశాం.. సక్సెస్ అయ్యాం..
-
India U19 vs Pakistan U19: వారి వళ్లనే మేము ఓడిపోయాం.. భారత్ కెప్టెన్ ఆవేదన..
ట్రెండింగ్
-
IPL 2027 Trade: డీల్ క్లోజ్.. పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. మ్యాచ్ విన్నర్‌ను వదులుకున్న ప్రీతి జింటా!
-
Diwali 2026: అమావాస్య ఎప్పుడొస్తుంది? దీపావళి లక్ష్మీ పూజకు శుభ ముహూర్తం, పూజా విధానం, పూర్తి వివరాలు ఇవే..
-
Diwali Tips: మట్టి ప్రమిదల్లో నూనె త్వరగా అయిపోతోందా? ఈ చిన్న చిట్కాలు పాటించండి..
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!