Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Exhaust Fan Cleaning Tips: వంట చేసేటప్పుడు వచ్చే పొగ, నూనె ఆవిరి కారణంగా కిచెన్‌లోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌పై క్రమంగా జిడ్డు, దుమ్ము పేరుకుపోతుంటుంది. దీంతో ఫ్యాన్ నల్లగా మారి చూడటానికి ఇబ్బందిగా కనిపిస్తుంది. సాధారణంగా శుభ్రం చేయాలంటే ఫ్యాన్‌ను పూర్తిగా విప్పాల్సి ఉంటుంది. కానీ కొన్ని సులభమైన చిట్కాలతో ఫ్యాన్‌ను తీయకుండానే మెరిసేలా శుభ్రం చేసుకోవచ్చు. అది ఎలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. వెనిగర్ లేదా అమోనియా స్ప్రే ట్రిక్
ఒక స్ప్రే బాటిల్లో సమాన మోతాదులో వేడి నీరు, వైట్ వెనిగర్ (లేదా కొద్దిగా లిక్విడ్ అమోనియా), కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్ కలపాలి. ముందుగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ కింద పాత పేపర్ లేదా క్లాత్ వేయాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఫ్యాన్ బ్లేడ్స్, జాలిపై స్ప్రే చేసి 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉంచాలి. జిడ్డు మెత్తబడిన తర్వాత పాత టూత్‌బ్రష్ లేదా స్పాంజ్‌తో రుద్ది శుభ్రం చేసి, పొడి క్లాత్‌తో తుడిచేస్తే ఫ్యాన్ మెరిసిపోతుంది.
Also Read
- Kitchen Hacks: ఫ్రిజ్‌లో పెట్టిన కొత్తిమీర త్వరగా పాడవుతోందా? ఇలా చేస్తే వారాల తరబడి ఫ్రెష్‌గా ఉంటుంది!
- Copper Utensils Cleaning Tips: రాగి, ఇత్తడి పాత్రలు నల్లగా మారాయా?.. 5 నిమిషాల్లో కొత్త మెరుపు.. సూపర్ హోం టిప్
- Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
- Refrigerator Tips : మీ రిఫ్రిజిరేటర్ పైన ఎప్పుడూ ఉంచకూడని 7 వస్తువులు ఇవే..!
2. బేకింగ్ సోడా పేస్ట్‌తో జిడ్డుకు చెక్
ఒక గిన్నెలో మూడు చెంచాల బేకింగ్ సోడా, కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్, గోరువెచ్చని నీటిని కలిపి చిక్కటి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఫ్యాన్‌పై ఎక్కువగా జిడ్డు పేరుకున్న ప్రాంతాల్లో టూత్‌బ్రష్ సహాయంతో అప్లై చేయాలి. సుమారు 20 నిమిషాల తర్వాత తడి స్పాంజ్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌తో తుడిచేయాలి. బేకింగ్ సోడా నూనె మరకలను సులభంగా తొలగించడంలో సహాయపడుతుంది.
3. స్టీమ్ క్లీనింగ్ లేదా హీట్ ట్రిక్
ఇంట్లో స్టీమ్ క్లీనర్ ఉంటే ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను విప్పకుండా శుభ్రం చేయడానికి ఇది మంచి మార్గం. ముందుగా కొద్దిగా డిష్‌వాష్ లిక్విడ్‌ను ఫ్యాన్‌పై స్ప్రే చేసి, ఆ తర్వాత స్టీమ్ క్లీనర్‌తో ఆవిరి ఇవ్వాలి. స్టీమ్ క్లీనర్ లేకపోతే హెయిర్ డ్రైయర్ నుంచి వచ్చే వేడి గాలిని కూడా ఉపయోగించవచ్చు. వేడి ప్రభావంతో గట్టిగా పేరుకున్న నూనె కరిగి సులభంగా తొలగిపోతుంది. తర్వాత శుభ్రమైన క్లాత్‌తో తుడిస్తే ఫ్యాన్ కొత్తదిలా కనిపిస్తుంది. ఈ సింపుల్ హోమ్ టిప్స్‌తో ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను శుభ్రం చేయడానికి ఎక్కువ సమయం, శ్రమ అవసరం లేకుండా ఇంట్లోనే సులభంగా క్లీనింగ్ చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Exhaust Fan Cleaning Tips: మీ కిచెన్ ఎగ్జాస్ట్ ఫ్యాన్ నల్లగా, జిడ్డుగా మారిందా? ఇలా చేస్తే విప్పకుండానే కొత్తదిలా మెరిసిపోతుంది!
-
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
-
Rohit Sharma Retirement: రోహిత్ రిటైర్మెంట్పై క్లారిటీ ఇచ్చిన కైఫ్.. సెలెక్టర్లకు గట్టి సందేశమా..?
-
Rahul Gandhi: 15 ఏళ్ల బాలికతో బలవంతంగా క్షమాపణలు చెప్పించారు..
-
High Court: కోడలి ఇల్లైనా అత్తగారికి హక్కుంటుంది.. హైకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!