Tips To Uses Of Silica Gel: ఏ వస్తువులు కొన్నా అందులో చిన్న తెల్లటి ప్యాకెట్ ఉందంటూ చాలా మంది పారేస్తున్నారు. బ్యాగులు, బాటిళ్లలో వచ్చే ఈ ప్యాకెట్లలో సిలికా జెల్ ఉంటుంది. ఇది కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు తాజాగా ఉంచేలా పని చేస్తుంది. సంచుల్లో, బాటిళ్లలో వచ్చే తెల్ల ప్యాకెట్లు తీసుకుని పాడేస్తాం. కానీ దానివల్ల మనకు ఎంత లాభమో తెలుసా.. బ్యాగులు, కంటైనర్లు, బాటిళ్లు, మందులలో చిన్న తెల్లటి ప్యాకెట్ మనకు కనిపిస్తే అదితీసి పడేసి మనం కొనుగోలు చేసిన వస్తువు వాడుకుంటాం. కానీ ఆ చిన్న తెల్లటి ప్యాకెట్ మనకు ఉపయోగ పడుతుందని మనం ఊహించలేనిది. దానివల్ల కొన్ని ప్రయోజనాలు మీకోసం..
Read also: ICAE: నేడు 32వ వ్యవసాయ ఆర్థికవేత్తల 32వ సదస్సు.. ప్రారంభించనున్న ప్రధాని
మొబైల్ తడిసినప్పుడల్లా మొబైల్ ఓపెన్ చేసి జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టి ఆ బ్యాగ్ లో సిలికా జెల్ సాచెట్ పెట్టుకోవాలి. ఫోన్ తడిగా ఉన్నప్పుడు, ఫోన్ సాధారణంగా పనిచేస్తుంది. వర్షాకాలంలో లెదర్ షూస్, బ్యాగులు, హ్యాండ్‌బ్యాగ్‌లు వాసన వస్తాయి. అలాంటి వాటిల్లో సిలికాజెల్ సాచెట్‌లు పెడితే వాసన రాదు. వంటగదిలో వేడి లేదా అల్యూమినియం వస్తువుల మధ్య సిలికా జెల్ సాచెట్ ఉంచాలి, అలా పెట్టడంతో మంచి సువాసన వస్తుంది. వర్షాకాలంలో మీ పర్సులో సిలికా జెల్ సాచెట్ ఉంచండి. ఇది బ్యాగ్‌లోని దుర్వాసనను తొలగిస్తుంది. సిలికా జెల్ సాచెట్‌లను బట్టల గదిలో తేమ లేదా వాసన ఉన్న చోట కూడా ఉంచవచ్చు.
Read also: World Bank: భారత్ కు ప్రపంచ బ్యాంకు షాకింగ్ న్యూస్.. ఇండియా ధనిక దేశంగా మారాలంటే..?
బట్టలు తాజాగా అనిపిస్తాయి. ఇనుప పాత్రలలో ఉంచిన సిలికా జెల్ సాచెట్ ఇనుప పాత్రలు తుప్పు పట్టకుండా చేస్తుంది. మీరు ఈ ప్యాకెట్లను మీరు కూడా తప్పకుండా వాడండి.. సిలికా జెల్ వాడితే దుర్వాసన రాదు. బాత్ రూంలో కూడా సిలికా జెల్ వాడితే దుర్వాసన రాదు. అలాగే బట్టల్లో వాడితే వాసన అస్సలు రాదు. ఇది కొనుగోలు చేసిన వస్తువు తాజాగా ఉండేందుకు పనిచేస్తుంది. ఇక అబ్బాయిలకైతే ఇది బాగా ఉపయోగపడుతుంది. బూట్లలో ఈ సిలికా జెల్ సాచెట్ పెట్టడం ద్వారా దుర్వాసన రాకుండా చేయడమే కాదు బూట్లలో ఎటువంటి పురుగులు రాకుండా ఇది చేస్తుంది. ఇలాంటి సిలికా జెల్ సాచెట్ ప్యాకెట్లు మీ ఇంట్లో దుర్వాసన లేకుండా చేసుకోండి.
Passenger Died: ఆరోగ్యం క్షీణించి బస్సులో ప్రయాణికుడు మృతి..