NTV Telugu Site icon

Foods- Cancer : రోడ్ సైడ్ టిఫెన్ చేస్తున్నారా? అయితే మీకు క్యాన్సర్ తప్పదు..!

Road Side Food

Road Side Food

ప్రస్తుతం జనాలు అంతా బిజీ లైఫ్ గడుపుతున్నారు. ఈ క్రమంలో ఏదైనా పనిని చేయాలనుకుంటే టైం సరిపోదని చెప్పి, కొన్నిసార్లు ఆహారాన్ని కూడా బయటే తినేస్తున్నారు. ఇలా బయట ఫాస్ట్​ ఫుడ్స్​, హోటళ్లు, రెస్టారెంట్లు, చిరు బండ్ల వద్ద ఏ టైంలో చూసినా రద్దీగానే ఉంటున్నాయి. కొందరైతే ఇంటి దగ్గర వండు కోవడం మానేస్తున్నారు. అయితే ఇలా బయట బిర్యానీ, ఫ్రైలు అంటూ బాగానే తింటున్నారు. కానీ అవి వేటితో తయారు చేస్తారు? రుచికి ఏం కలుపుతున్నారు? ఇంతకీ అవి తాజావేనా అనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా? రోడ్‌ సైడ్ టిఫెన్ చేసేవాళ్లకు మాత్రం ఓ షాకింగ్ న్యూస్ వెలువడింది. ఈ ఫుడ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట.

READ MORE: IND vs SA: శాంసన్ వీర విహారం.. సిక్సులతోనే డీల్

రోడ్‌ సైడ్ ఫుడ్‌ను తయారు చేసే పద్ధతి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ ఆహార తయారీకి ఉపయోగించే నూనె నల్లగా కనిపిస్తుంది. అంటే నూనెను ఎక్కువగా మరిగించడం, అదే నూనెలో నాలగైదు దఫాలుగా వాడటం వల్ల ఆ కలర్ వస్తుంది. దీని వల్ల చాలా ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఇంకా ముఖ్యంగా రోడ్‌సైడ్ ఫుడ్ తయారీ దారులు మినిమం శుభ్రత కూడా పాటించడం లేదు. తక్కువ ధరకు లభించే సరకుల వినియోగించడం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

READ MORE:Indian Railways: భార్యాభర్తల గొడవతో రైల్వేకి రూ.3కోట్లు నష్టం.. ఏం జరిగిందంటే?

ముఖ్యంగా క్యాన్సర్ మహమ్మారి ముప్పును పెంచుతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు నూనె పదార్థాలు, బయట ఫుడ్ తీసుకునే విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. ఆయిల్ ను ఎక్కువసార్లు మరిగించడం వల్ల అందులోని టోటల్‌ పోలార్‌ కాంపౌండ్స్‌ (టీపీసీ) ఫ్రీరాడికల్స్‌గా మారుతాయి. నార్మల్​గా వంట నూనెలో పోలార్‌ కాంపౌండ్స్‌ 25 శాతానికి మించితే దాన్ని మార్చాలని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా) నిబంధనలు పేర్కొంటున్నాయి. దాదాపు అన్ని హోటళ్లలో మోతాదుకు మించి హానికరమైన ఫుడ్‌ కలర్‌లు, టేస్టింగ్‌ సాల్ట్‌, సోయా సాస్‌లు యూజ్ చేస్తున్నారు. కాబట్టి, రోడ్ సైడ్ ఫుడ్ తీసుకోవడం కారణంగా ఆరోగ్య సమస్యలు కొనితెచ్చుకున్నట్లేనని హెచ్చరిస్తున్నారు.

Show comments