Bacteria Effect: స్మార్ట్ ఫోన్‌పై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది.. ఆ తరువాత స్థానం కీ బోర్డుది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bacteria Effect: మనం ఎంత శుభ్రంగా ఉంటే.. అంత ఆరోగ్యంగా ఉంటాం. ఎంత ఆరోగ్యంగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో బ్యాక్టీరియాలు మనపై దాడి చేస్తాయి. అలా బ్యాక్టీరియా మూలంగా రోగాల బారిన పడతాం. మొన్నటి వరకు ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ కూడా బ్యాక్టీరియా మూలంగానే వచ్చింది. అనంతరం తీవ్ర ప్రభావం చూపింది. అయితే బ్యాక్టీరియ ఎక్కువగా ఎక్కడ ఉంటుందనేది తెలుసుకుంటే ఆశ్యర్యానికి గురి కాక తప్పదు. ఎక్కువ బ్యాక్టీరియ ఉండేది మనం నిత్యం వాడే స్మార్ట్ ఫోన్‌పై బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందని అధ్యయనంలో తేలింది. కరోనా పుణ్యమా అని పరిశుభ్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగింది. గతంతో పోలిస్తే ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎన్ని జాగ్రత్తలు పాటించినా నిత్య జీవితంలో ఉపయోగించే ఏడు వస్తువులు టాయిలెట్ సీటుపై కంటే మురికిగా ఉంటున్నాయట. వాటిపై లెక్కకు మించిన బ్యాక్టీరియా క్రిములు పేరుకుపోతున్నాయట. అమెరికాకు చెందిన పరుపుల తయారీ కంపెనీ చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. ఇంతకీ ఆ వస్తువులేంటో తెలుసా.. ఇవి ఆ ఏడు వస్తువులు..
Read also: Telangana BJP: బీజేపీలో కీలక మార్పులు..! బండిని తప్పిస్తే పార్టీ చీఫ్ ఎవరు..?
Also Read
- Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
- Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
టాయిలెట్ కంటే మురికిగా ఉండే వాటిలో మొదటిది స్మార్ట్‌ఫోన్. దీనిపై టాయిలెట్ సీటుపై కంటే పదిరెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది. పరిసరాల నుంచి నిరంతరం మన చేతికి అంటుకునే క్రిములు అక్కడి నుంచి స్మార్ట్ఫోన్పైకి చేరుతాయని ఇప్పటికే ఎన్నో అధ్యయనాలు తెలిపాయి. కాబట్టి సబ్బు నీటిలో ముంచిన తడిగుడ్డతో కానీ, యాంటీ బ్యాక్టీరియల్ ఉపయోగించి కానీ ఫోనును నిత్యం శుభ్రం చేస్తూ ఉండాలని నిపుణులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్ తర్వాతి స్థానంలో కీబోర్డు ఉంది. అరిజోనా యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం సగటు కీబోర్డుపై ఒక చదరపు అంగుళంలో 3 వేలకు పైగా బ్యాక్టీరియా ఉంటుందట. కంప్రెస్డ్ ఎయిర్ కానీ, బ్రష్‌తో కూడిన వ్యాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించి కానీ శుభ్రం చేసుకోవాలని చెబుతున్నారు. ఇక మూడోస్థానంలో ఇంట్లో ఎక్కువమంది ముట్టుకునే వాటిలో రిఫ్రిజిరేటర్ ఒకటి. కాలిఫోర్నియా యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం రిఫ్రిజిరేటర్ డోర్‌పై చదరపు అంగుళంలో 500కుపైగా బ్యాక్టీరియా ఉంటుంది. అయితే, ఈ వస్తువులపై ఉండే బ్యాక్టీరియా ఎక్కువగా హాని కలిగించదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. మనచుట్టూ ఉండే పరిసరాలు, నిత్యం ఉపయోగించే వస్తువులను తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండడం వల్ల సాధారణ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు. దాదాపు ప్రతి ఇంట్లోనూ దిండు (మెత్త) ను ఉపయోగిస్తారు. వారం రోజులపాటు దానిని ఉతక్కుండా వాడితే టాయిలెట్ సీటుపై కంటే 17 వేల రెట్ల అధిక బ్యాక్టీరియా ఉంటుందని అధ్యయనం హెచ్చరించింది.
Read also: Bro Teaser: పూజా లేకుండా సినిమాలు తీయరా?.. త్రివిక్రమ్‌ను ఆడుకుంటున్న నెటిజన్లు!
అత్యంత మురికిగా ఉండేవాటిలో మౌస్ కూడా ఒకటి. శానిటైజర్‌తో ఎంత రుద్దినా దానిపై ఉన్న మురికి అంత త్వరగా వదలదు. దీనిపై చదరపు అంగుళానికి 1500 బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుందని కాలిఫోర్నియా యూనివర్సిటీ స్టడీ తేల్చింది. ఇంట్లో మురికిగా ఉండే వస్తువుల లిస్టులో మరొకటి రిమోట్ కంట్రోల్. దీనిపై చదరపు అంగుళానికి 200 బ్యాక్టీరియా ఉంటుందని హాస్టన్ యూనివర్సిటీ స్టడీ స్పష్టం చేసింది. ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే వాటిలో వాష్‌రూమ్ ఒకటి. పబ్లిక్ వాష్‌రూమ్స్‌ను ఎంతోమంది ఉపయోగిస్తుంటారు. ఈ నాబ్స్పైన వందలకొద్దీ బ్యాక్టీరియా పేరుకుపోయి ఉంటుంది. వీటిని నిత్యం క్లీన్ చేసుకోవడం మేలు. ఇంట్లో వాడే నల్లాలను కూడా రోజులో ఎంతోమంది ముట్టుకుంటారు. దీంతో ఇది కూడా క్రిములకు ఆవాసంగా మారిపోతున్నది. చేతులు కడుకున్న సమయంలో అదే చేతితో డిటర్జెంట్‌తో దానిని క్లీన్ చేసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. పైన చెప్పిన వాటిని ఎంత ఎక్కువ అవకాశం ఉన్న మేరకు వాటిని శుభ్రంగా ఉంచుకోవడం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
-
Mumbai: ముంబైలో CJP నిరసనలు.. పోలీసుల అదుపులో అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్!
-
Kona Venkat : ఆ డైరెక్టర్లను బ్యాన్ చేయాలి.. సంచలన కామెంట్లపై కోన వెంకట్ క్లారిటీ
-
Gyanesh Kumar: జ్ఞానేశ్ కుమార్, ఈసీకి 124 మంది మాజీ-బ్యూరోక్రాట్ల మద్దతు.!
-
Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!