Thailand visa : ఈ ఒక్క ట్రిక్ తెలిస్తే థాయ్‌లాండ్‌లో 5 ఏళ్ళు ఉండొచ్చని తెలుసా ? ఏం చేయాలంటే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thailand visa : కొన్ని దేశాలు కేవలం టూరిస్టులను మాత్రమే ఆహ్వానిస్తాయి. కానీ మరికొన్ని దేశాలు మాత్రం “ఇక్కడికి రండి… కొంతకాలం మాతోనే జీవించండి” అని ప్రపంచానికి ఓపెన్ ఇన్విటేషన్ ఇస్తాయి. ఇప్పుడు అలాంటి ఆహ్వానం ఇస్తున్న దేశాల్లో థాయ్‌లాండ్ ముందంజలో నిలిచింది. బీచ్‌లు, నైట్‌లైఫ్, స్ట్రీట్ ఫుడ్, తక్కువ ఖర్చుతో లగ్జరీ జీవితం కోసం ఇప్పటికే భారతీయుల్లో భారీగా క్రేజ్ సంపాదించుకున్న ఈ దేశం.. ఇప్పుడు డిజిటల్ నోమాడ్స్, రిమోట్ వర్కర్స్, ఫ్రీలాన్సర్ల కోసం ప్రత్యేకంగా “డెస్టినేషన్ థాయ్‌లాండ్ వీసా” అనే కొత్త దీర్ఘకాలిక వీసాను తీసుకువచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో, ట్రావెల్ కమ్యూనిటీల్లో, ఐటీ ఉద్యోగుల్లో ఈ వీసా గురించే పెద్ద చర్చ నడుస్తోంది.
మల్టిపుల్ ఎంట్రీ వీసా
‘డెస్టినేషన్ థాయ్‌లాండ్ వీసా’ (DTV) అనేది సాధారణ టూరిస్ట్ వీసా కాదు. ఇది ఐదేళ్లపాటు చెల్లుబాటు అయ్యే మల్టిపుల్ ఎంట్రీ వీసా. అంటే ఒకసారి వీసా పొందిన తర్వాత అవసరాన్ని బట్టి పలుమార్లు థాయ్‌లాండ్‌లోకి వెళ్లి రావచ్చు. ముఖ్యంగా రిమోట్‌గా పనిచేసే ఉద్యోగులు, ఫ్రీలాన్సర్లు, విదేశీ క్లయింట్ల కోసం పని చేసే ప్రొఫెషనల్స్, అలాగే థాయ్ కుకింగ్ క్లాసులు, వెల్నెస్ రిట్రీట్స్, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే వారికి ఈ వీసా ప్రధానంగా ఉపయోగపడుతుంది.
Also Read
- Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
- WHO: ఇంట్లోనే విషం? 35లక్షల మరణాలకు కారణం ఇదే!
- Japanese Kitchen Cleaning Tips: గిన్నెలు తోమడం ఇక చాలా తేలిక.. జపాన్ ప్రజలు పాటించే సింపుల్ ఆర్డర్ ఇదే!
- Jelly Bangles Designs: ఇప్పుడు ఈ గాజులే ట్రెండ్.. కుర్తీ, జీన్స్, చీర.. ప్రతి డ్రెస్‌కు సరిపోయే డిజైన్లు.. ఇలా ట్రై చేయండి..
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా “వర్క్ ఫ్రం ఎనీవేర్” కల్చర్ పెరుగుతున్న వేళ, థాయ్‌లాండ్ ఈ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటోంది. ఒకప్పుడు కేవలం పర్యాటక ప్రాంతంగా మాత్రమే కనిపించిన దేశం.. ఇప్పుడు “లాంగ్ స్టే లైఫ్ స్టైల్ హబ్”గా మారాలని ప్రయత్నిస్తోంది. అందుకే ఈ వీసాను కేవలం ఉద్యోగులకు మాత్రమే కాకుండా, తమ సంస్కృతిని నేర్చుకునే వారికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. బ్యాంకాక్‌లో థాయ్ వంటల కోర్సులో చేరడం, వెల్నెస్ క్యాంపుల్లో పాల్గొనడం వంటి అంశాల ఆధారంగా కూడా ఈ వీసాకు అర్హత పొందొచ్చు.
ఈ వీసాతో ఒక్కోసారి థాయ్‌లాండ్‌లో 180 రోజుల వరకు ఉండొచ్చు. అవసరమైతే మరో 180 రోజులు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే దాదాపు ఏడాది వరకు అక్కడే నివసించే వీలుంది. అయితే దీనికి కొన్ని కఠినమైన ఆర్థిక ప్రమాణాలు కూడా ఉన్నాయి. దరఖాస్తుదారులు కనీసం 5 లక్షల థాయ్ బాత్ ఆర్థిక లావాదేవీలు చూపించాలి. భారత కరెన్సీలో ఇది దాదాపు రూ.14 నుంచి 15 లక్షల మధ్య ఉంటుంది. బ్యాంక్ స్టేట్మెంట్లు, శాలరీ స్లిప్‌లు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ఉద్యోగ ఒప్పందాల వంటి అధికారిక పత్రాల ద్వారా దీనిని పొందచ్చు.
డిజిటల్ మోడల్లోనే దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తు ప్రక్రియ కూడా పూర్తిగా డిజిటల్ మోడల్లోనే ఉండేలా థాయ్‌లాండ్ రూపొందించింది. థాయ్ ఈ వీసా పోర్టల్ లేదా భారతదేశంలోని BLS కేంద్రాల ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. పాస్‌పోర్ట్, ఆరోగ్య బీమా, వసతి వివరాలు, ఉపాధి రుజువులు, కోర్సు లేదా ట్రైనింగ్ నమోదు పత్రాలు వంటి డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. సాధారణంగా వీసా ఫీజు రూ.25 వేల వరకు ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఇంటర్వ్యూ లేదా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం థాయ్ ఎంబసీకి వెళ్లాల్సి రావచ్చు.
భారతీయుల్లో ఇప్పటికే థాయ్‌లాండ్‌కు ఉన్న ఆదరణను చూస్తే, ఈ కొత్త DTV వీసా మరింత మంది యువతను ఆకర్షించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, ఫ్రీలాన్స్ డిజైనర్లు, కంటెంట్ క్రియేటర్లు, యూట్యూబర్లు, స్టార్టప్ వ్యవస్థాపకులు వంటి వారికి ఇది కొత్త లైఫ్ స్టైల్ డోర్ ఓపెన్ చేసినట్టే కనిపిస్తోంది. టూరిస్ట్ వీసాల గందరగోళం లేకుండా, చట్టబద్ధంగా ఎక్కువకాలం విదేశాల్లో నివసిస్తూ పని చేయాలనుకునేవారికి థాయ్‌లాండ్ ఇప్పుడు మరింత దగ్గరైందనే చెప్పుకోవచ్చు.
తాజావార్తలు
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Neha Sharma : దాక్కున్నా వదిలిపెట్టను.. ఆ వీడియోలు వెంటనే డిలీట్ చేయండి: హీరోయిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
-
AP Local Body Elections: కూటమి నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్.. ఎన్నికల వ్యూహంపై చర్చ
-
Double Diabetes: మీకు డబుల్ డయాబెటిస్ ఉందా?
-
Destiny : కామెడీ వదిలేసి.. అడవిలో జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్!
ట్రెండింగ్
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!
-
Kavya Maran – Anirudh Ravichander పెళ్లి ఫిక్స్.! గ్రీస్‌లో పెళ్లి, చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్.?