Health Tips: చాయ్.. సవాలక్ష పంచాయతీల మధ్య కాసింత ప్రశాంతతను ఇచ్చేది చాయ్ తాగే టైం. ఈ రోజుల్లో చాయ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగంలా మారిపోయింది. సరే ఇక్కడ వరకు అంతా మంచిగానే ఉంది. మీకు తెలుసా రోజుకు ఎన్ని సార్లు చాయ్ తాగాలో. ఏదైనా మోతాదులో ఉంటే మంచిగానే ఉంటుంది. ఎప్పుడైతే మోతాదు దాటిపోతుందో.. అప్పటి నుంచి షురూ అవుతాయ్ రోగాలు.. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. కప్పు చాయ్‌తో గుప్పెడు గుండెకు ప్రమాదం పొంచి ఉందని తెలియడం. దీనిపై వైద్య నిపుణులు ఏం అంటున్నారు. ఇంతకీ ఆ ప్రమాదాలు ఏంటనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: CM Chandrababu: హైటెక్ సిటీ రాక ముందు హైదరాబాద్‌లో ఎకరం రూ.లక్ష.. ఇప్పుడు రూ.100 కోట్లు..
రోజులో ఎక్కువగా టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మీకు తెలుసా టీ ఎక్కువగా తాగడంతో గుండె సమస్యలతో పాటు నిద్ర సమస్యలను కూడా పెంచుతుందని అంటున్నారు. అందుకే టీని మోతాదులో తీసుకోవాలని సూచిస్తున్నారు. చాయ్‌లో అధిక మొత్తంలో కెఫీన్ ఉంటుంది. కెఫీన్ కారణంగా ఆందోళన, నిద్రలేమి, ఒత్తిడికి మనిషి జీవితంలో ప్రవేశిస్తాయని అంటున్నారు. టీలో టానిన్లు కూడా ఉంటాయని.. ఇవి దంత సమస్యలను కలిగిస్తాయని చెబుతున్నారు. చాయ్ ఎక్కువ తాగితే దంతాలు త్వరగా పాడవుతాయని హెచ్చరిస్తున్నారు. టీ ఎక్కువగా తాగితే గ్యాస్, కడుపు నొప్పి, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయని వెల్లడించారు. ముఖ్యంగా ఉదయం నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగడం మానుకోవాలని సూచిస్తున్నారు.
పాలు, చక్కెర కలిపి తయారు చేసిన టీ తాగడం ఆరోగ్యకరమైన అలవాటు కాదంటున్నారు నిపుణులు. ఇది రుచిగా ఉంటుంది కానీ ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలను అందించదని చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు.. మాత్రం కచ్చితంగా గ్రీన్ టీ, బ్లాక్ టీ అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉన్నందున.. యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్‌తో నిండి ఉంటాయని పేర్కొంటున్నారు. టీ ఆకుల్లో కేలరీలు ఉండవు. గ్రీన్ టీ, బ్లాక్ టీలను వేడి నీళ్లలో కలిపితే తక్కువ మొత్తంలో కేలరీలు ఉత్పత్తి అవుతాయి. 250 ml టీలో కూడా 3 కేలరీలు మాత్రమే ఉంటాయి. టీలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కానీ, టీలో పాలు కలిపినప్పుడే దాని క్యాలరీ కంటెంట్ పెరుగుతుంది. పాలతో టీ తాగే అలవాటు బరువును పెంచుతుందని సూచిస్తున్నారు.
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.