NTV Telugu Site icon

Indian Snakeroot: ఈ ఒక్క మొక్క పెంచండి.. మీ ఇంటి పరిసరాల్లో పాములు అస్సలు రావు..

44 Snakes Found

44 Snakes Found

పామును చూడగానే మనుషులు వణికిపోతారు. పాములను చంపడానికి ఈ భయమే ప్రధాన కారణం. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం.. ఏటా 50 లక్షల మంది పాముకాటుకి గురవుతున్నారు. అందులో దాదాపు 81 వేల నుంచి లక్షా 38 వేల మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో పాముకాటుకి గురై చనిపోతున్న వారి సంఖ్య భారత్‌లోనే అత్యధికంగా ఉంది. 2020లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. 2000 సంవత్సరం నుంచి 2019 వరకు 12 లక్షల మంది పాముకాటు కారణంగా చనిపోయారు. వైద్య సదుపాయాలు అందుబాటులో లేకపోవడం, బాధితులు సహజ నివారణ పద్ధతులను పాటించడం వంటి వాటి వల్ల పాముకాట్లకు గురైన వారి సంఖ్య కచ్చితంగా తేలడం లేదు.పాముల పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ మరణాలకు కారణమని పరిశోధకులు చెబుతున్నారు.

READ MORE: China: ముదిరిన యూఎస్, చైనా వాణిజ్య వివాదం.. బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ సహా పలు సంస్థలపై ఆంక్షలు..

ఇదిలా ఉండగా.. ప్రస్తుత చలికాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. మీ ఇంటి చుట్టుపక్కలకు పాములు రాకుండా ఉంటాలంటే.. ఒక్క మొక్కను పరిసరాల్లో నాటండి. మొక్కలను మీ కాంపౌండ్‌లో లేదా పెరట్లో పెంచుకుంటే పాములు మీ ఇంటి దగ్గరకు రావు అని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్క పేరు ఏంటి? అని ఆలోచిస్తున్నారా? అదే సర్పగంధ మొక్క. దీని వాసన చాలా వింతగా ఉంటుంది. ఈ వాసన పాములకు పడదు. అందుకే పాములు ఈ మొక్క వాసన చూసిన వెంటనే పారిపోతాయంట. సహజ లక్షణాలు అధికంగా ఉండే ఈ మొక్క యొక్క మూలాలు పసుపు, గోధుమ రంగులో ఉంటాయి. ఆకులు ప్రకాశవంతమైన ఆకుపచ్చ రంగులో ఉంటాయి. చలికాలంలో మీ ఇంట్లోకి పాముల రాకుండా ఉండాలంటే పెరట్లో ఈ మొక్కను పెంచుకోండి.

READ MORE: China: ముదిరిన యూఎస్, చైనా వాణిజ్య వివాదం.. బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ సహా పలు సంస్థలపై ఆంక్షలు..

Show comments