Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Vegetarian Recipes: సాధారణంగా ఇంట్లో గుమ్మడికాయ కూర వండుతున్నారంటే చాలు.. పిల్లల నుంచి పెద్దల వరకు చాలామంది ముఖం చిట్లిస్తుంటారు. కానీ, ఆ గుమ్మడికాయకు కాస్త మఖానా (తామర గింజలు) యాడ్ చేసి, దానికి ఒక చిన్న ‘స్మోకీ టచ్’ ఇస్తే.. అచ్చం రెస్టారెంట్ గ్రేవీ కర్రీలా మారిపోతుంది. ఒక్కసారి ఈ స్టైల్లో వండి పెడితే, గుమ్మడికాయ వద్దన్న వాళ్లు కూడా ఒక్క ముద్ద కూడా వదలకుండా లొట్టలేసుకుంటూ తినేస్తారు. చలికాలంలో మార్కెట్లో తాజాగా దొరికే గుమ్మడికాయలోని సహజమైన తీపి, మఖానా తాలూకు కరకరలాడే రుచి, ఘాటైన మసాలాల కలయిక ఈ వంటకాన్ని స్పెషల్‌గా మారుస్తాయి. రోటీ, పరాఠా లేదా వేడివేడి అన్నంలోకి అదిరిపోయే ఈ రెస్టారెంట్ స్టైల్ ‘స్మోకీ గుమ్మడికాయ-మఖానా కర్రీ’ని ఇంట్లోనే సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు:
* గుమ్మడికాయ ముక్కలు: 400 గ్రాములు (చిన్నవిగా కట్ చేసుకోవాలి)
Also Read
- Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
- Electric Comb: బట్టతల బాధితులకు చైనా గుడ్ న్యూస్.. ఎలక్ట్రిక్ దువ్వెనతో 28 రోజుల్లోనే వెంట్రుకలు!
- Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే 'మరమరాల మిక్చర్' సులువుగా చేసుకోండి ఇలా..!
- Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే 'ఉసిరికాయ పులిహోర'.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
* మఖానా (తామర గింజలు): 80 గ్రాములు
* ఉల్లిపాయ: 1 (సన్నగా తరిగినది)
* టమాటా ప్యూరీ: 2 టమాటాలది
* అల్లం-వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
* జీలకర్ర: 1 టీస్పూన్
* పసుపు: అర టీస్పూన్
* ధనియాల పొడి: 1 టీస్పూన్
* కశ్మీరీ కారం: అర టీస్పూన్
* గరం మసాలా: అర టీస్పూన్
* ఫ్రెష్ క్రీమ్ లేదా జీడిపప్పు పేస్ట్: 2 టేబుల్ స్పూన్లు
* నెయ్యి: 1 టేబుల్ స్పూన్
* ఉప్పు: రుచికి సరిపడా
తయారీ విధానం ఇలా..
ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి, అందులో మఖానా వేసి సన్నని మంటపై కరకరలాడే వరకు వేయించి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత గుమ్మడికాయ ముక్కలకు కొద్దిగా నెయ్యి రాసి పెనం మీద గానీ, గ్రిల్ మీద గానీ దోరగా కాల్చుకోవాలి. ఇలా ముందుగానే రోస్ట్ చేయడం వల్ల కూరకు అచ్చం రెస్టారెంట్లో లాంటి ‘స్మోకీ ఫ్లేవర్’ వచ్చి రుచి రెట్టింపు అవుతుంది. ఇప్పుడు అదే కడాయిలో నెయ్యి వేసి వేడయ్యాక జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. అనంతరం టమాటా ప్యూరీ, పసుపు, ధనియాల పొడి, కశ్మీరీ కారం వేసి బాగా కలపాలి. మసాలా చిక్కబడి, నెయ్యి పైకి తేలే వరకు ఉడికించాలి.
గ్రేవీ రెడీ అయ్యాక అందులో ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు పోయాలి. మూత పెట్టి సన్నని మంటపై 8 నుంచి 10 నిమిషాల పాటు గుమ్మడికాయ మెత్తబడే వరకు ఉడికించాలి. ఆ తర్వాత అందులో ఫ్రెష్ క్రీమ్ లేదా జీడిపప్పు పేస్ట్ వేసి కలపాలి. చివరగా గరం మసాలా చల్లి మరో రెండు నిమిషాలు ఉంచాలి. అన్నీ పూర్తయ్యాక స్టవ్ ఆఫ్ చేసే ముందు, వేయించి పెట్టుకున్న మఖానాను కూరలో వేసి సున్నితంగా కలపాలి. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే.. మఖానాను ఎప్పుడూ వడ్డించే ముందు మాత్రమే వేయాలి. అప్పుడే అవి మెత్తబడకుండా కరకరలాడుతూ భలే రుచిగా ఉంటాయి. అంతే.. నోరూరించే రెస్టారెంట్ స్టైల్ ‘స్మోకీ గుమ్మడికాయ-మఖానా కర్రీ’ రెడీ. ఈసారి ఇంట్లో గుమ్మడికాయ తెచ్చినప్పుడు ఈ పద్ధతిలో వండి చూడండి.. ఇంటిల్లిపాదీ ఫిదా అవ్వాల్సిందే.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Healthy Vegetarian Recipes: గుమ్మడికాయ అంటే ముఖం చిట్లిస్తున్నారా? రెస్టారెంట్ స్టైల్లో ఇలా చేసి చూడండి.. మెతుకు వదలరు!
-
Ukraine: ‘‘పుతిన్‌ను బుజ్జగించడం కన్నా ఇలా చేయండి’’..ట్రంప్, జిన్పింగ్లకు ఉక్రెయిన్ విజ్ఞప్తి
-
Rahul Gandhi: రాజకీయాల్లో మోడీ ప్రత్యేకం.. రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Dhanush: ‘ఓం’ రిలీజ్ వేళ ధనుష్ స్పెషల్ నోట్.. ఫ్యాన్స్‌కు కీలక విజ్ఞప్తి!
-
Telangana RERA : తెలంగాణ రెరా కీలక ఆదేశాలు.. పలు రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై కొరడా
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..