Eating Biscuits with Tea: రోజూ ఛాయ్ తో బిస్కెట్ తింటున్నారా.. బీకేర్ ఫుల్
- చాలామందికి టీతో కలిసి బిస్కెట్లు
- తినడం రోజువారీ అలవాటు
- ఉదయం లేవగానే టీతో పాటు బిస్కెట్లు
- తినడం మంచిది కాదన్న నిపుణులు
మన దేశంలో చాలామందికి టీతో కలిసి బిస్కెట్లు తినడం రోజువారీ అలవాటుగా మారింది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు టీతో పాటు బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అయితే ఈ అలవాటు శరీరానికి హానికరని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.
మార్కెట్‌లో లభించే బిస్కెట్లలో ఎక్కువగా శుద్ధి చేసిన పిండి, చక్కెర, ఉప్పు, ప్రిజర్వేటివ్‌లు ఉంటాయని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. ఇవి టీతో కలిసి తిన్నప్పుడు రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగి తర్వాత వేగంగా పడిపోతాయంటున్నారు. దీర్ఘకాలంలో ఈ మార్పులు ఇన్సులిన్ నిరోధకతకు, మధుమేహానికి దారితీయవచ్చంటున్నారు. అదనంగా టీలోని కేఫిన్, టానిన్లు ఖాళీ కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతాయి. బిస్కెట్లలోని శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఆమ్లత్వం, గుండెల్లో మంట, అజీర్తి వంటి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తాయని నిపుణులు తెలిపారు.
Also Read
- Cucumber Chutney Recipe: మండుటెండలో చల్లని టేస్టీ రెసిపీ.. దోసకాయ చట్నీ ఇలా తయారు చేయండి..
- Thandai Masala Recipe: వేసవికి చల్లని ఔషధం.. ఇంట్లోనే క్షణాల్లో తండై మసాలా తయారు చేసుకోండి..!
- Curd Rice Recipe: వడదెబ్బకు చెక్.. వేసవిలో చల్లని ఉపశమనం కోసం పెరుగన్నం.. ఇలా తయారు చేసుకోండి
- Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!
అయితే టీ, బిస్కెట్ల కలయిక పేగుల్లోని మంచి బ్యాక్టీరియాలను బలహీనపరచి జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుందని న్యూట్రిషియన్లు చెబుతున్నారు. దీంతో గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రావచ్చన్నారు.బిస్కెట్లలో ఫైబర్ తక్కువగా ఉండటం, అనారోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండటం వల్ల బరువు పెరగుతారన్నారు. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుందన్నారు. వీటిని నివారించాలంటే ఖాళీ కడుపుతో టీ–బిస్కెట్లు తినే అలవాటును మానుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వీటికి బదులు ఆరోగ్యాన్ని మెరుగైన పరిచే ఆహార పానీయాలను తీసుకోవాలంటున్నారు.
తాజావార్తలు
-
Donald Trump: 14-సూత్రాల ప్లాన్‌తో ఇరాన్.. ఆమోదయోగ్యం కాదని ట్రంప్ తిరస్కరణ.. మళ్లీ యుద్ధం చెలరేగుతుందా?
-
Dubbing Movies : అర్థంకాని టైటిల్స్ పెట్టి నష్టపోతున్న నిర్మాతలు
-
India Ship: హార్మూజ్ జలసంధి దాటిన భారత్‌కు వస్తున్న LPG క్యారియర్.. మే 13న విశాఖకు!
-
Mumbai Indians: ఓటమిలోనూ వరల్డ్ రికార్డ్.. టీ20 క్రికెట్ చరిత్రలో తొలి జట్టుగా ముంబై ఇండియన్స్
-
Ruturaj Gaikwad: ముంబైని ముంచిన చెన్నై వ్యూహం.. సీఎస్‌కే గెలుపు రహస్యం చెప్పిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
ట్రెండింగ్
-
3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!