ఒక్కొక్కరు ఒక్కో రకమయిన అభిరుచిని కలిగి వుంటారు. కొందరు ట్రెక్కింగ్ ఇష్టపడతారు. మరికొందరికి నడక అంటే ఇష్టం. సముద్రాలు, టూరిస్టు ప్రాంతాలకు వెళుతుంటారు. ఇండోనేషియాలోని బాలి గొప్ప పర్యాటక ప్రాంతం. అక్కడికి ఏటా లక్షలమంది పర్యాటకులు వెళుతుంటారు. ఇండోనేషియాలోని ద్వీపం బాలి. పర్యాటకులు దీనిని భూతల స్వర్గంగా భావిస్తారు. అలాంటి ప్రాంతంలో ఓ ఫోటోగ్రాఫర్ చేసిన అందరినీ సంభ్రమాశ్చర్యాలకు, మరికొందరిని టెన్షన్ కి గురిచేసింది.
ఎర్త్‌పిక్స్ పేరుతో వున్న ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక ఉత్కంఠభరితమైన వీడియోను పోస్ట్ చేసింది. వీడియోలో, బాలిలోని ఒక ఫోటోగ్రాఫర్ – ఒక కొండపైన ఒక విమానం రెక్కపై నడవడం చూడవచ్చు. ఈ విమానం కొండ పైభాగంలో వుంటుంది. కొండకు ఆనుకుని పార్క్ చేసిన విమానం రెక్కపై అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటూ నడుస్తున్న వీడియో ఇన్ స్టాగ్రామ్‌లో వైరల్ అవుతోంది. ఆ ఫోటోగ్రాఫర్ పేరు కోమింగ్ దర్మావన్ (koming darmawan).
కొండపైన ఉంచిన విమానం ఎక్కువ మంది వచ్చి సందర్శించడానికి వీలుగా పర్యాటక ఆకర్షణగా మార్చబడింది. ఉలువాటు బడంగ్ రీజెన్సీలోని న్యాంగ్-న్యాంగ్ బీచ్ సమీపంలో పర్యాటక వసతి గృహంగా దీనిని మారుస్తున్నారు. ఉలువాటు నైరుతి బాలిలో ఉంది. ఇది ఇసుకతో కూడిన తెల్లని బీచ్‌లతో కూడిన పచ్చటి కొండలతో చాలా సుందరంగా పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. బాలిలోని సహజ సౌందర్యాన్ని చూసి పరవశులవుతుంటారు. చాలా మందికి కమింగ్ దర్మావాన్ రెక్కపై నడవడం ఆందోళనను కలిగించిందని రియాక్ట్ అయ్యారు.
అతను నడవడం చూసి నాకు ఆందోళన కలిగింది. అతను చివరి వరకు వెళ్లడం చూసి నా మోకాళ్లు బలహీనంగా మారాయి అని రాస్తే.. మరొకరు నేను అక్కడ నడుస్తున్నట్లయితే నేరుగా కింద పడతాను అంటూ రాశాడు. బాలిలోని ప్రతి పర్యాటక ప్రాంతం అద్భుతంగా వుంటుంది. బాలిలో ఒక రాత్రి గడపాలనుకుంటే శానూర్ బీచ్ కి వెళ్ళండి. మీకు అంతరించిపోతున్న జాతుల గురించి మరింత తెలుసుకోవటానికి షార్క్ యూనిటీకి వెళ్ళండి, వాటికి ఆహారం ఇవ్వండి మరియు వాటితో ఈత కొట్టండి. మీకు కొన్ని వస్తువులు కొనాలని కోరుకుంటే, సింధు మార్కెట్‌కు వెళ్ళవచ్చు. కోమింగ్ దర్మావన్ నడిచిన విమానం రెక్కపై మీరు నడవాలనుకుంటే అది మా బాధ్యత కాదు.
Viral News: గుర్రమెక్కిన వరుడు.. మంచమెక్కిన గుర్రం