Male Fertility: సిగరెట్ మాత్రమే కాదు.. ఈ అలవాట్లు కూడా స్పెర్మ్ కౌంట్‌ను దెబ్బతీస్తున్నాయి..
- సిగరెట్ మాత్రమే కాదు.. లైఫ్ స్టైల్ కూడా స్పెర్మ్ కౌంట్‌ను దెబ్బతీస్తోంది.
- ఊబకాయం, ఒత్తిడి, మద్యం, హార్మోన్ల సమస్యలు కూడా ప్రధాన కారణాలు.
- సరైన చికిత్స, జీవనశైలి మార్పులతో స్పెర్మ్ నాణ్యత మెరుగుపడే అవకాశం ఉంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Male Fertility: ప్రస్తుత కాలంలో సంతానలేమి సమస్యలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రస్తుత ఆహారపు అలవాట్లు, లైఫ్ స్టైల్, ఒత్తిడి ఇలా పలు కారణాలు పురుషుల్లో ‘‘శుక్ర కణాల’’లను దెబ్బతీస్తున్నాయి. చాలా మంది పురుషుల్లో వీర్య కణాల సంఖ్య తగ్గిపోతుంది. దీనికి ప్రధాన కారణంగా సిగరేట్, పొగాకు వినియోగం అని చాలా మంది భావిస్తుంటారు. కానీ ఇతర అలవాట్లు కూడా ఈ సమస్యను మరింత పెంచుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
వీర్యంలో ప్రతీ మిల్లీలీటర్‌కు 15 మిలియన్ల కన్నా తక్కువ స్పెర్మ్ ఉంటే దానిని ఒలిగోస్పెర్మియా (Oligospermia) అంటారు. ఒకవేళ వీర్యంలో స్పెర్మ్ అసలే లేకపోతే దానిని అజూస్పెర్మియా (Azoospermia)గా పిలుస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో గర్భధారణ అనేది చాలా కష్టం అవుతుంది.
Also Read
- Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
- Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
లో- స్పెర్మ్ కౌంట్ కు లక్షణాలు ఉంటాయా?
స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్న చాలా మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అయితే, ఏడాది పాటు భార్యతో దాంపత్య జీవితం తర్వాత కూడా గర్భం రాకుంటే ఏదైనా సమస్య ఉందని భావించాలి. కొందరిలో లైంగిక ఆసక్తి తగ్గడం, అంగస్తంభన సమస్యలు, వృషణాల్లో నొప్పి, వాపు లేదా గడడ్డలు వంటి లక్షణాలు కనిపించవచ్చు.
స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి కారణాలు ఇవే:
సిగరెట్, పొగాకు మాత్రమే కాకుండా అధిక బరువు (ఊబకాయం), దీర్ఘకాలిక మానసిక ఒత్తిడి, మద్యం అధికంగా తీసుకోవడం, మాదకద్రవ్యాల వినియోగం, హార్మోన్ల అసమతుల్యత వంటి అంశాలు కూడా స్పెర్మ్ కౌంట్‌ను తగ్గిస్తాయి. అదనంగా కొన్ని ఇన్ఫెక్షన్లు, వేరికోసెల్ (Varicocele), థైరాయిడ్ సమస్యలు, కొన్ని మందులను ఎక్కువకాలం వాడటం కూడా పురుషుల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు.
చికిత్సతో మెరుగవుతుందా?
తక్కువ స్పెర్మ్ కౌంట్ ఉన్నంత మాత్రాన పిల్లలు కలుగరని కాదు. ప్రస్తుతం మందులు, జీవనశైలిలో మార్పులు, ఆధునిక ఫెర్టిలిటీ చికిత్సల ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. పోషకాహారం తీసుకోవడం, వ్యాయామం, బరువు నియంత్రణ, ఒత్తిడిని తగ్గించుకోవడం, సిగరేట్, పొగాకు అలవాట్లకు దూరంగా ఉండటం స్పెర్మ్ నాణ్యత, సంఖ్యను మెరుగుపరుస్తుంది.
తాజావార్తలు
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
India Plan: అదిరిపోయిన గంభీర్, శ్రేయస్ అయ్యర్ ప్లాన్.. రెండో టీ20 ఓటమి నుంచి మూడో టీ20లో గెలుపుకు పాటించిన సూత్రం ఇదే..
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
ట్రెండింగ్
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!