NTV Telugu Site icon

Health Warning: ఆరుగంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? అయితే ఈ రోగాలు ఖాయం

Sleep

Sleep

Health Warning: మనిషి ఆరోగ్యంలో నిద్ర చాలా ముఖ్యం. నిద్ర వల్ల అలసిపోయిన శరీరం తిరిగి శక్తిని పొందుతుంది. ఎన్నో రోగాలకు నిద్ర సహజ ఔషధంగా పనిచేస్తుంది. అలాగే నిద్ర కారణంగా శరీరంలోని ప్రతి అవయవానికి తిరిగి సత్తువ చేరుతుంది. అయితే అతి నిద్ర అయినా, నిద్ర తక్కువ అయినా అది ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రలేమి సమస్య వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అసహజంగా పెరుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. రాత్రి నిద్ర సమయంలో గ్లూకోజ్ పెరుగుదల సహజమే కానీ దీనివల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతాయని తెలుస్తోంది. ఇది అలాగే కొనసాగితే టైప్-2 డయాబెటిస్‌గా రూపాంతరం చెందుతుంది. స్థూలకాయం సమస్య కూడా దీనివల్ల కలుగుతుంది.

Read Also: మీ ఫేవరేట్ సీరియల్ హీరోయిన్లు రోజుకు ఎంత తీసుకుంటారో తెలుసా..?

సాధారణంగా మనకు 7-8 గంటల నిద్ర అవసరం. ఈ నిద్ర కూడా సరైన సమయంలో అవసరం అని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోవడం శరీరానికి మంచిది కాదు. సరైన సమయంలో నిద్రపోవడం వల్ల శరీరంలో జీవక్రియలు సక్రమంగా జరిగి ఆరోగ్యంగా ఉంటాం. ప్రతి అవయవం నిద్రలో శక్తిని పొందుతుంది. ఇలా సరైన నిద్ర పోవడం వల్ల గుండె జబ్బులు, స్ట్రోక్, మధుమేహం, స్థూలకాయ సమస్యలు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చు.

మధుమేహం ఉన్నవారు అయితే నిద్ర విషయంలో మరింత జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. వీరికి గుండె జబ్బులు వచ్చే ఛాన్సులు అధికంగా ఉంటాయి. కాబట్టి ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా 6 గంటల కంటే తక్కువ నిద్ర పోయే వారిలో కార్టిసోల్ హార్మోన్ అధికంగా విడుదల అవుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను దారితీస్తుంది. కాబట్టి తగినంత నిద్ర సరైన సమయంలో పోయి ఆరోగ్యంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.