Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
- నిమ్మకాయలు నెల రోజుల పాటు తాజాగా ఉండే చిట్కాలు..
- రసం, రుచి తగ్గకుండా నిమ్మకాయలను నిల్వ చేసే పద్ధతులు..
- నీటిలో ముంచి నిమ్మకాయలను నిల్వ చేయడం..
- నిమ్మకాయలకు ఆవ నూనె పలుచగా రాయడం..
- టిష్యూ పేపర్లో ఒక్కో నిమ్మకాయను విడిగా చుట్టడం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lemon Storage Tips: మార్కెట్ నుంచి నిమ్మకాయలు తెచ్చి కూరగాయల బుట్టలో వేసేస్తే అవి త్వరగా ఎండిపోవడం మొదలవుతాయి. ఫ్రిజ్‌లో పెట్టినా కూడా కొన్ని రోజులు మాత్రమే తాజాగా కనిపిస్తాయి. ఆ తర్వాత నిమ్మకాయల పైన గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇలా జరగకుండా ఉండాలంటే.. వాటిని సరైన పద్ధతిలో నిల్వ చేయడం చాలా అవసరం.
సరిగ్గా స్టోర్ చేస్తే నిమ్మకాయలు చాలా రోజులు తాజాగా ఉంటాయి, అలాగే రసం కూడా తగ్గదు. ఇంట్లో ఎప్పుడైనా ఎక్కువ నిమ్మకాయలు కొని తెచ్చినప్పుడు ఈ సింపుల్ ట్రిక్స్ చాలా ఉపయోగపడతాయి. వీటితో నిమ్మకాయలు త్వరగా చెడవు, ఎండిపోవు కూడా.. నిమ్మకాయలను చాలా రోజులు నిల్వ చేయాలనుకుంటే వాటితో ఊరగాయ చేసి పెట్టుకోవచ్చు. కానీ ఊరగాయలో మసాలాలు వేస్తాం కాబట్టి రుచి మారిపోతుంది. ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నది నిమ్మకాయలను తాజాగా ఎలా ఉంచాలి.? వాటి రుచి, రసం రెండూ ఎలా అలాగే ఉండాలి అనే విషయం. అందుకే ఆ పద్ధతులను తెలుసుకుందాం.
Also Read
- Jowar Roti to Ragi Roti: రొట్టెల్లో వెరైటీ కావాలా?.. జొన్న నుంచి రాగి వరకు.. ఆరోగ్యకరమైన 6 రకాల రొట్టెలు ఇవే!
- Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్‌లోకి అదిరిపోయే "మసాలా గుత్తివంకాయ" చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
- Relationship Blindness: ప్రేమ ఉన్నా మాటలే లేవా?
- Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
మొదటి పద్ధతి – నీటిలో ముంచి ఉంచడం:
నిమ్మకాయలు తాజాగా ఉంచడానికి చాలా ఇళ్లలో ఈ పద్ధతినే పాటిస్తారు. నిమ్మకాయలను నీటిలో ముంచి ఉంచితే అవి తాజాగా ఉంటాయి. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి. వాటిని శుభ్రమైన ఎయిర్‌టైట్ జార్లో వేసి, నీళ్లు నింపి మూత బిగించి పెట్టాలి. ఇలా చేస్తే నిమ్మకాయలు చాలా రోజులు చెడకుండా ఉంటాయి.
రెండో పద్ధతి – ఆవ నూనె రాయడం:
నిమ్మకాయలపై ఆవ నూనెను పలుచగా రాసి, ఎయిర్‌టైట్ కంటైనర్‌లో పెట్టి నిల్వ చేయండి. అవసరమైనప్పుడు కంటైనర్ నుంచి తీసి కడిగి వాడుకోవచ్చు. మిగిలిన నిమ్మకాయలను అలాగే జార్లోనే ఉంచేయండి. నూనె పైన సన్నని పొరలా ఉండడం వల్ల నిమ్మకాయలు త్వరగా ఎండిపోవు, బయటి గాలి కూడా లోపలికి చొరబడదు.
మూడో పద్ధతి – టిష్యూ పేపర్లో చుట్టి ఉంచడం:
ఇన్ఫ్లుయెన్సర్ అంజలి తాను క్రమం తప్పకుండా పాటించే పద్ధతి ఇదేనని చెప్పారు. ప్రతి నిమ్మకాయను వేరు వేరుగా టిష్యూ పేపర్లో బాగా చుట్టి, ఎయిర్‌టైట్ జార్లో పెట్టి మూత బిగించి ఉంచాలి. టిష్యూ పేపర్ లేకపోతే మరేదైనా పేపర్ కూడా వాడవచ్చు. ఈ పద్ధతితో నిమ్మకాయలు నెల రోజుల కంటే ఎక్కువ కాలం కూడా చెడకుండా ఉంటాయి.
తాజావార్తలు
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
John Abraham: జాన్ అబ్రహం కొత్త థ్రిల్లర్.. ఆ పాత్రలో అసలు ఎవరూ ఊహించని షేడ్స్.. లండన్‌లో షూటింగ్!
-
Harish Rawat: హరీశ్ రావత్ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్‌లోని అన్ని పదవులకు రాజీనామా
-
AP Weather Alert: 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు.. ఈ జిల్లాలకు హెచ్చరికలు
-
SSY: ఆడపిల్ల భవిష్యత్తుకు బెస్ట్ పొదుపు పథకం.. నెలకు రూ.1,500 కడితే.. చేతికి రూ.8.32 లక్షలు.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?