ముద్దంటే కొందరికి ఇష్టం ఉంటుంది.. మరికొందరికి అస్సలు నచ్చదు.. అయితే ముద్దు పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అసలు ఎలా పెట్టుకోవాలి? ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో అస్సలు ఆలస్యం చెయ్యకుండా తెలుసుకుందాం పదండీ..
ముద్దు ఒక మధురమైన అనుభూతి. ఒక చిరు ముద్దు ఎన్నో భావాలను పలికిస్తుంది. నిజానికి ముద్దు మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని అంటున్నారు.. ఆందోళనను తగ్గించడం నుంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, రక్తపోటును కంట్రోల్ చేయడం వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. ముద్దుతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
*.ముద్దు కార్టిసాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఈ కార్డిసాల్ ఒత్తిడిని కలిగిస్తుంది. అయితే ముద్దు కార్డిసాల్ స్థాయిలను తగ్గించి మీ ఒత్తిడిని దూరం చేస్తుంది. ఇది యాంగ్జైటీని కూడా తగ్గిస్తుంది.
*. ముఖ్యంగా ముద్దు వల్ల సంతోషం పెరుగుతుంది.. ముద్దు పెట్టుకున్నప్పుడు మీ మెదడు ఆక్సిటోసిన్, డోపామైన్, సెరోటోనిన్ వంటి రసాయనాలను విడుదల చేయడానికి ప్రేరేపించబడుతుంది. ఇది మీరు సంతోషంగా, ఉల్లాసంగా ఉంచుతుంది. అలాగే ఒత్తిడిని కలిగించే మీ కార్టిసాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. సంతోషకరమైన హార్మోన్ల మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.. వెంటనే శక్తిని కూడా ఇస్తుంది..
*. ముద్దు పెట్టేటప్పుడు మీ హృదయ స్పందన రేటు బాగా పెరుగుతుంది. దీంతో రక్త నాళాలు విస్తరిస్తాయి. ఇది రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. అలాగే అధిక రక్తపోటును తగ్గిస్తుంది. అలాగే మీరు ముద్దు పెట్టుకున్నప్పుడు కార్టిసాల్ స్థాయిలు తగ్గడంతో పాటుగా కొలెస్ట్రాల్ స్థాయిలు బాగా తగ్గుతాయి..
*.ముద్దు పెట్టుకున్నప్పుడు మీ జీవక్రియ కూడా పెరుగుతుంది. దీంతో హృదయ స్పందన రేటు పెరుగుతుంది. అలాగే మీ శరీరంలో ఆక్సిజన్ ప్రవహించే రేటును కూడా పెంచుతుంది. ముద్దు 3 నుంచి 35 ముఖ కండరాలను నిమగ్నం చేస్తుంది. ఇది మీ ముఖానికి బలమైన వ్యాయామాన్ని ఇస్తుంది. ఇది మీ ముఖ కండరాలను టోనింగ్ చేయడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది..
*. రోగ నిరోధక శక్తిని మెరుగు పరుస్తుంది..లాలాజలం మీ దంతాలకు అంటుకున్న కుహరం కలిగించే కణాలను తొలగించడానికి సహాయపడుతుంది..
*. అన్నిటికన్నా ముందు మీ బంధం బలంగా మారుతుంది.. దంపతుల మధ్య ప్రేమను పెంచుతుంది.. ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ ముద్దు ను మరింత ముద్దుగా పెట్టేసుకోండి..