ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు జరుపుకునే వాలెంటైన్స్ వీక్‌లో, ఫిబ్రవరి 12ని కిస్ డేగా జరుపుకుంటారు. ప్రేమను వ్యక్తీకరించడానికి ముద్దు ఉత్తమ మార్గం. దీని ద్వారా ఎదుటి వ్యక్తికి ఏమీ చెప్పకుండానే మీ ప్రేమను వ్యక్తపరచవచ్చు.
ముద్దంటే కొందరికి ఇష్టం ఉంటుంది.. మరికొందరికి అస్సలు నచ్చదు.. అయితే ముద్దు పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.. అసలు ఎలా పెట్టుకోవాలి? ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో అస్సలు ఆలస్యం చెయ్యకుండా తెలుసుకుందాం పదండీ.. ముద్దు ఒక మధురమైన అనుభూతి. ఒక చిరు ముద్దు ఎన్నో భావాలను పలికిస్తుంది. నిజానికి ముద్దు మీ మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని అంటున్నారు.. ఆందోళనను తగ్గించడం నుంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడం, రక్తపోటును కంట్రోల్ చేయడం…