Amun Fruit: గర్భిణీలు నేరేడు పండు తింటున్నారా..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవి చివర్లో, వర్షా కాలం ఆరంభంలో అధికంగా కనిపించే పండు నేరేడు పండు. చిన్ననాటి జ్ఞాపకాలు గా ఉండే ఈ నలుపు ఊదా రంగు పండు రుచి పరంగా అద్భుతమైనదే కాదు, ఆరోగ్యానికి అనేక లాభాలు కూడా కలిగిస్తుంది. నేరేడు పండ్లలో గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్లో ఉంచుతుంది. అయితే ఎక్కువగా తినడం వల్ల బెనిఫిట్స్ కాస్త సైడ్ ఎఫెక్ట్స్‌గా మారుతాయట. కాబట్టి ఎక్కువగా తినడం కంట్రోల్ చేసుకుంటే మంచిదని చెప్తున్నారు. అంతే కాదు ఎక్కువగా తింటే హైపోటెన్షన్ పెరిగి.. బీపీ రాపిడ్గా తగ్గిపోతుంది. ఇది కళ్లు తిరగడం వంటి సమస్యలను పెంచుతుంది. ప్రత్యేకించి గర్భిణీ స్త్రీలు ఈ పండ్లు తినాలా? తింటే ఎంత మోతాదులో తినాలి? అన్న సందేహాలు చాలామందిలో ఉంటాయి. వాటికి సమాధానమే ఈ వ్యాసం.
ఆరోగ్య ప్రయోజనాలు:
నేరేడు జీర్ణం మెరుగుపరుస్తుంది – మలబద్ధకం, అజీర్ణ సమస్యలు ఉన్నవారికి మంచి సహాయం చేస్తుంది. తక్కువ కేలరీలతో తక్షణ శక్తిని ఇచ్చే పండు కావడం వల్ల అలసటను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రక్తపోటును నియంత్రించే, గుండెను కాపాడే గుణాలు ఇందులో ఉన్నాయి. కాలేయం, ప్రేగులు, ఆర్థరైటిస్ సమస్యలకి ఉపశమనం అందిస్తాయి.
Also Read
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Weight Loss Snack: బరువు తగ్గాలనుకుంటున్నారా? పొట్ట చుట్టూ కొవ్వు కరగాలా? మీ డైట్లో దీనిని చేర్చుకోండి!
- Health: ఒంటరిగా భోజనం చేస్తున్నారా? అయితే, మీరు రిస్క్‌లో పడ్డట్లే.. షాకింగ్ స్టడీ..
- Budda Parakalu Pulusu: తెలంగాణ స్టైల్లో బుడ్డ పరకల పులుసు.. ఈ ఒక్క టిప్ పాటిస్తే రుచి పీక్స్!
హానికర ప్రభావాలు (అధికంగా తినితే):
ఈ నేరేడు అధికంగా తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడవచ్చు, ఇందులో ఉండే ‘ఆక్సలేట్’ అనే పదార్థం, శరీరంలో కాల్షియం తో కలిసి రాళ్లకు దారి తీస్తుంది. అలాగే రక్తపోటు అధికంగా తగ్గిపోవచ్చు, తల నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా జీర్ణ సమస్యలు గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు అధిక మోతాదులో తింటే ఏర్పడతాయి. దంత ఆరోగ్యం, నోట్లో ఆమ్లం ఉత్పత్తి పెరిగి దంత ఎనామెల్‌ను ప్రభావితం చేస్తుంది.
గర్భిణీలకు ప్రత్యేక సూచనలు:
గర్భిణీ స్త్రీలు ప్రత్యేకంగా 6 నెలల తర్వాత ఈ పండును తినాలంటే డాక్టర్ సలహా తీసుకోవడం చాలా అవసరం. హార్మోన్ల మార్పులు, జీర్ణ సంబంధిత సున్నిత పరిస్థితులు ఈ దశలో ఎక్కువగా ఉండటంతో, ఏ పండును అయినా మితంగా తీసుకోవాలి. సాధారణంగా, రోజుకు 100 గ్రాముల వరకే తినడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. నెరేడు తిన్న వెంటనే నోటిని కడగడం, బ్రష్ చేయడం అవసరం. ముఖ్యంగా రాత్రిపూట తినే పండ్లు మరింత జాగ్రత్త అవసరం.
ముగింపు
నేరేడు పండు సహజంగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. కానీ అది మితంగా తీసుకున్నప్పుడు మాత్రమే మంచిది. ముఖ్యంగా గర్భిణీల విషయంలో ఈ పండును తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం చాలా అవసరం. రోజువారీ పరిమితిని పాటిస్తూ, శుభ్రమైన పండును, అవసరమైన జాగ్రత్తలతో తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
తాజావార్తలు
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్‌లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!