Site icon NTV Telugu

Health Tips: ఉదయాన్నే ఈ ఆకు తింటే.. ఒంట్లోని కొవ్వు ఇట్టే కరిగిపోతుంది!

Tulasi Plant

Tulasi Plant

Do You Know Health Benefits of Holy Basil: ప్రస్తుత జీవనశైలిలో ఎక్కువగా ఇబ్బంది పెడుతున్న వ్యాధుల్లో ‘కొలెస్ట్రాల్’ ముందువరుసలో ఉంది. కొలెస్ట్రాల్ శరీరానికి అవసరమే కానీ.. మోతాదుకు మించి ఉండకూడదు. శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్, మరొకరి బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అంటే హై డెన్సిటీ కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్). రక్త సరఫరా, రక్త వాహికల నిర్మాణంలో ఇది ఉపయోగపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే లో డెన్సిటీ కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్‌). ఇది మనిషి శరీరానికి చాలా ప్రమాదకరం. ఎందుకంటే.. ఎల్‌డీఎల్‌ రక్త వాహికల్లో పేరుకుపోతుంది. దాంతో రక్త సరఫరా తగ్గిపోతుంది. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు వస్తాయి. కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయడంలో తులసి బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు.

తులసి:
తులసి చెట్టు ప్రతి ఇంట్లో ఉంటుంది. దీనికి ఇంట్లోని ఆడవారు ఎక్కువగా పూజ చేస్తారు. తులసి ఆధ్యాత్మికంగానే కాదు.. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. తులసి ఆకులను తీసుకోవడం వల్ల రక్తంలో హై కొలెస్ట్రాల్ కంట్రోల్ అవుతుంది. తులసి వల్ల కిడ్నీల ద్వారా కొలెస్ట్రాల్ మొత్తాన్ని కరిగించుకోవచ్చు. రోజూ 2-3 తులసి ఆకుల్ని ఖాళీ కడుపుతో తినాలి. లేదా తులసి రసాన్ని కూడా తీసుకోవచ్చు.

Also Read: Nandini Rai Pics: టైట్‌ఫిట్ డ్రెస్‌లో నందిని రాయ్.. ఒంపుసొంపులు చూపిస్తూ రచ్చ చేసిన హాట్ బ్యూటీ!

వెల్లులి:
రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ కరిగించడానికి వెల్లులి బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. వెల్లుల్లి తింటే కొలెస్ట్రాల్‌ దాదాపుగా 7 శాతం తగ్గుతుందట. వెల్లుల్లిలోని అల్లిసిన్‌కు యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. అందుకే హై కొలెస్ట్రాల్ ఉన్న వారికి వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది. రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే కొలెస్ట్రాల్‌ కరుగుతుంది.

ధనియాలు:
ధనియాలను మనం నిత్యం వాడుతాం. వీటిని వాడడం వల్ల మూత్రపిండాలు బాగా పని చేసేలా చేస్తాయి. బాడీలోని ట్యాక్సిన్స్, వ్యర్థాలను సులభంగా తొలగిస్తాయి. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ని తొలగించి కిడ్నీలు చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తాయి.

Also Read: Sai Dhanshika Saree Pics: రెడ్ శారీలో సాయి ధన్సిక.. హాట్ స్టిల్స్ వైరల్!

Exit mobile version