బిడ్డ పుట్టిన వెంటనే అతను ఎవరి పోలిక అనే విషయం మీదే అందరి దృష్టి ఉంటుంది. కానీ ముఖం మాత్రమే కాదు, ఆరోగ్యానికి సంబంధించి పలు లక్షణాలు కూడా వారసత్వంగా బిడ్డకు వస్తాయి. వాటిలో ముఖ్యమైనది బట్టతల సమస్య. తాజా జన్యుపరమైన పరిశోధనల ప్రకారం, పురుషుల్లో కనిపించే బట్టతల సమస్యకు తల్లి నుంచి వచ్చే X క్రోమోజోమ్ ప్రధాన కారణమవుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో ఉన్న బలహీన జన్యువులు జుట్టు పెరుగుదల పై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఈ స్థితిని ఆండ్రోజెనిక్ అలోపేసియా (Androgenic Alopecia) అని పిలుస్తారు.
తల్లి వారసత్వమే ప్రధాన కారణం :
చాలామందిలో బట్టతల తండ్రి నుంచి వస్తుందని ఒక అపోహలో ఉంటారు. కానీ శాస్త్రం ప్రకారం చూసుకుంటే, అది తప్పు. తల్లి కుటుంబంలోని పురుషులలో బట్టతల ఉంటే, అదే లక్షణం పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనిని పూర్తిగా నివారించే లేకపోయినా, తొలిదశల్లో గుర్తించి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, బట్టతల రాకుండా నియంత్రించవచ్చు.
బట్టతల నుంచి రక్షణకు సూచనలు :
1. శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వండి
తలకు తేమను, పోషణను ఇచ్చే హెయిర్‌కేర్ ప్రోడక్ట్స్ వాడాలి. హార్ష్ కెమికల్స్ ఉన్న షాంపూలను దూరం పెట్టాలి.
2. ఆహారంలో ప్రోటీన్, ఐరన్
జుట్టు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్, ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
3. ఒత్తిడిని తగ్గించండి
ఒత్తిడి కూడా జుట్టు రాలడానికి పెద్ద కారణం. అందువల్ల యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి పాటించడం మంచిది.
4. జుట్టు ఆరోగ్యాన్ని గమనించండి
తరచూ జుట్టులో మార్పులు గమనించి, ప్రాథమిక దశలోనే నిపుణులను సంప్రదించాలి.
జన్యుపరమైన కారణాలను మార్చలేము… కానీ ప్రభావాన్ని తగ్గించవచ్చు!
జెన్స్‌ను మనం మార్చలేం. కానీ ఆరోగ్యకరమైన జీవనశైలి, తగిన జుట్టు సంరక్షణ ద్వారా బట్టతల ప్రభావాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. ఇది బట్టతల పై ఉన్న అపోహలను తగ్గించడమే కాకుండా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి కూడా దోహదపడుతుంది.