Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
- బీట్రూట్ తినడానికి ఇష్టపడని వారికి హల్వా మంచి ప్రత్యామ్నాయం
- బీట్రూట్తో రుచికరమైన, సులభమైన హల్వా తయారీ
- తెల్ల పంచదారకు బదులుగా సహజసిద్ధమైన బెల్లం ఉపయోగించవచ్చు
- చిక్కటి పాలు, నెయ్యి, జీడిపప్పు, కిస్మిస్తో మరింత రుచికరంగా తయారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Healthy Beetroot Halwa Recipe: బీట్రూట్ ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా రక్తహీనత (Anemia) సమస్యతో బాధపడేవారికి, నీరసం తగ్గించి తక్షణ శక్తిని అందించడానికి బీట్రూట్ ఒక ఔషధంలా పనిచేస్తుంది. అయితే దీని పచ్చి వాసన, రుచి కారణంగా పిల్లలు మాత్రమే కాదు, పెద్దలు కూడా కూరలు లేదా జ్యూస్‌ల రూపంలో తీసుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపించరు.
అలాంటి వారికి బీట్రూట్తో చేసే స్వీట్స్ అద్భుతమైన ప్రత్యామ్నాయం. పైగా ఇందులో ఎలాంటి తెల్ల పంచదార (Sugar) వాడకుండా, సహజసిద్ధమైన బెల్లం, చిక్కటి పాలతో ఎంతో రుచికరంగా హల్వా తయారు చేసుకోవచ్చు. పండగలు, ప్రత్యేక సందర్భాల్లోనే కాకుండా పిల్లలకు ఈవెనింగ్ స్నాక్‌గా చేసి పెట్టడానికి కూడా ఇది బెస్ట్ హెల్దీ ఛాయిస్ కూడా. ఈ పద్ధతిలో చేస్తే బీట్రూట్ పచ్చి వాసన ఏమాత్రం తెలియకుండా, నోట్లో వెన్నలా కరిగిపోతుంది. మరి ఆ ఆరోగ్యకరమైన బీట్రూట్ హల్వాను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Also Read
- Psychology Facts: రేపటి దుఃఖాన్ని ఈరోజే ఎందుకు అనుభవిస్తున్నాం? సైకాలజీ ఏం చెబుతోంది?
- Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
- Iron Deficiency: నిద్రపోయినా అలసటగా ఉందా? ఐరన్ లోపానికి ఈ 6 సంకేతాలు కావచ్చు..!
- White vs Yellow Potatoes: తెల్ల బంగాళాదుంప vs పసుపు బంగాళాదుంప.. ఏది ఏ వంటకానికి బెస్ట్?
కావలసిన పదార్థాలు:
* తురిమిన బీట్రూట్: 1 కప్పు (ఒక మీడియం సైజ్ బీట్రూట్),
* కాచి చల్లార్చిన చిక్కటి పాలు: 1 కప్పు,
* తురిమిన బెల్లం: 1/4 కప్పు (సుమారు 4 టేబుల్ స్పూన్లు),
* నెయ్యి: 2 టేబుల్ స్పూన్లు,
* జీడిపప్పు: 1 టేబుల్ స్పూన్,
* కిస్మిస్: 1 టేబుల్ స్పూన్,
* యాలకుల పొడి: 1/2 టీస్పూన్.
తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి దానిపై బాండీ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. ఆ నెయ్యి కరిగాక అందులో జీడిపప్పు పలుకులు వేసి దోరగా, లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన నెయ్యిలో ముందుగా తురిమి పెట్టుకున్న బీట్రూట్ను వేయాలి. మధ్యస్థ మంటపై పచ్చివాసన పోయేంత వరకు సుమారు 10 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి.
అలా బీట్రూట్ చక్కగా వేగిన తర్వాత అందులో 1 కప్పు కాచి చల్లార్చిన చిక్కటి పాలను పోయాలి. ఇప్పుడు దానిపై మూతపెట్టి మంటను లో-టు-మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పాలు దగ్గరపడేవరకు, బీట్రూట్ మెత్తగా ఉడికేవరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ పాలలో బాగా ఉడికిన తర్వాత అందులో పావు కప్పు తురిమిన బెల్లం వేసి కలపాలి. బెల్లం నచ్చకపోతే చెక్కర కూడా వేసుకోవచ్చు. అలా వేసిన బెల్లం పూర్తిగా కరిగి దగ్గరపడే సమయంలో వేయించిన కిస్మిస్, యాలకుల పొడి, మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. అన్ని వేశాక హల్వా బాండీలో మిశ్రమం ముద్దగా అయ్యేంత వరకు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆపేయాలి. అంతే ఎంతో ఆరోగ్యకరమైన “బీట్రూట్ హల్వా” రెడీ.!
తాజావార్తలు
-
Beetroot Halwa: బీట్రూట్ తినడం ఇష్టం లేదా.. అయితే “బీట్రూట్ హల్వా” ఇలా చేసేయండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.!
-
IND vs SL: గాలె టెస్టులో అంపైర్‌ను వణికించిన డీఎస్పీ.. తృటిలో తప్పిన పెను ప్రమాదం.. వీడియో వైరల్!
-
Mega 158 : చిరు – బాబీ సినిమాకు దాదాపు ఆ టైటిల్ ఫిక్స్ ?
-
Psychology Facts: రేపటి దుఃఖాన్ని ఈరోజే ఎందుకు అనుభవిస్తున్నాం? సైకాలజీ ఏం చెబుతోంది?
-
Jana Nayagan OTT Release: ఓటీటీలోకి దళపతి విజయ్ ‘జన నాయగన్’.. ఎప్పటి నుంచి చూడొచ్చంటే?
ట్రెండింగ్
-
Sanjay Manjrekar: లైవ్‌లో మాజీ క్రికెటర్ల మధ్య వార్.. అద్దంలో చూసుకో అంటూ ఒకరిపై మరొకరు సెటైర్లు!
-
Jeep Compass 85th Anniversary Edition లాంచ్.. ధర రూ.26.70 లక్షలు, కేవలం 85 యూనిట్లే!
-
Flower Plants: వర్షాలు పడుతున్నాయా.? అయితే ఆలస్యం ఎందుకు.. ఎక్కువ కష్టపడకుండానే ఇంట్లోనే పూల తోట పెంచేయండి ఇలా..!
-
రూ.8,499కే ఇంట్లోనే థియేటర్.! 200 అంగుళాల స్క్రీన్, స్మార్ట్ ఫీచర్లతో XElectron Techno Plus ప్రొజెక్టర్ లాంచ్.!
-
Jio Prime Membership: గుడ్‌న్యూస్.. Jio Prime రీలాంచ్.. ఏడాది పాటు రీఛార్జ్ ధర టెన్షన్ ఉండదు..!