ప్రపంచంలోనే అత్యంత వేగంగా విస్తరిస్తున్న వ్యాధి ఏది అంటే నరాలకి సంబంధించిందనే చెప్పాలి. ఇది వ్యాధి మెదడులోని భాగాలను దెబ్బతీస్తుంది. డోపమైన్ అని పిలవబడే న్యూరోట్రాన్స్మిటర్ ద్వారా మెదడు అంతటా సంకేతాలు ప్రసరించే బాధ్యత ఈ నాడీ కణాలదే. సాధారణ పరిస్థితులలో మృదువైన సమతుల్య కండరాల సమన్వయాన్ని డోపమైన్ సహాయంతో సాధించవచ్చు. ఈడోపామైన అనే ఈ న్యూరోట్రాన్స్మిటర్ లేకపోవడం మూలంగానే పార్కిన్సన్స్ వ్యాధి లేక వణుకుడు రోగం మనుషుల్లో సంభవిస్తుంది. పార్కిన్సన్స్ చాలా మందికి 60 ఏళ్ళ దాటాక వస్తుంది. 50 ఏళ్లలోపు ఉన్న వారికి 5 నుంచి 10 శాతం వరకు ఈ సమస్య వస్తుంది.. 40 సంవత్సరాల లోపు ఉన్న వారిలో 20 మందిలో ఒకరికి వస్తుంది. ఇది కొంతమందిలో వారసత్వంగా వస్తుంది. వీటి లక్షణాలు గుర్తిస్తే వెంటనే మీరు డాక్టర్ ని సంప్రదించడం మంచింది.
అసలు పార్కిన్సన్స్ ఎందుకు వస్తుందో సరైన ఆధారాలు లేవు. వయస్సు, జన్యు, పర్యావరణ కారకాల కలయిక కారణంగా డోపమైన్ ఉత్పత్తి చేసే నరాల కణాలు చనిపోయేలా చేస్తుంది. నిపుణుల ప్రకారం దాదాపు 500 మందిలో ఒకరు పార్కన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. స్త్రీల కంటే పురుషులకి ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. మెదడు కదలికలను సరిగ్గా నియంత్రించడానికి తగినంత డొపమైన్ తయారు కానప్పుడు పార్కిన్సన్స్ వస్తుంది. దీని లక్షణాలు ఒకటి చేతుల్లో వణుకు. సరిగ్గా నిలబడలేరు, కూర్చోలేరు. బ్యాలెన్సింగ్ లేకపోవడం ఈ వ్యాధి మరో లక్షణం.
పార్కిన్సన్స్ ఆటోమేటిగ్గా మన కదలికలపై నియంత్రణ కోల్పోయేలా చేస్తుంది. కాబట్టి పోశ్చర్ ఎలా ఉండాలనే దాన్ని బ్రెయిన్ మర్చిపోతుంది. దీంతో చాలా మంది తమ శరీరాన్ని బ్యాలెన్స్ చేయలేరు. వంగిపోతారు. భుజాలు గుండ్రంగా మారుతాయి. తల, మొత్తం శరీరం ముందుకు సాగిపోతాయి. శరీరం వంకరగా కనిపించేలా ఉంటుంది. పార్కిన్సన్స్ ఉంటే ముందుకు వంగి నడుస్తుంటారు. మెల్లిగా చేతులు ఊపుతుంటారు. ఇది రాను రాను పెరుగుతుంది. కదలికల్లో మార్పులు ఉంటాయి. సమస్యలు తలెత్తుతాయి. పార్కిన్సన్స్ శరీరంలో ఒక వైపు నుండి ప్రారంభమవుతాయి. వ్యాధి ముదిరే కొద్దీ శరీరానికి రెండువైపులా ఉంటాయి. లక్షణాలు ముదురుతాయి.
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?