NTV Telugu Site icon

Warm Water Health Tips: గోరువెచ్చని నీటిని తాగడం వల్ల బరువు తగ్గుతారా..? నిజమెంత..?

Warm Water Health Tips

Warm Water Health Tips

Warm Water Health Tips: బరువు తగ్గాలంటే వివిధ పద్దతులను అవలంబిస్తున్నారు కొందరు. అంతేకాదు బరువు తగ్గేందుకు ఆహారాన్ని తినడం కూడా మానేస్తున్నారు. ఇక మరొకొందరైతే.. ఆహారంలో వివిధ అంశాలను చేర్చుకుంటారు. ఇక ఈ రోజుల్లో వ్యాయామం చేయడం, జిమ్ చేయడం కూడా బొడ్డు కొవ్వును తగ్గించే పద్దతిలో ఉంది. ప్రతి ఒక్కరు బరువు తగ్గడానికి అత్యంత ప్రాచుర్యం పొందిన మార్గాలలో ఒకటి గోరువెచ్చని నీరు తాగడం. ఇక తరచుగా మహిళలు బరువు తగ్గడానికి వేడి నీటిని తాగుతారు. దీంతో.. బరువు తగ్గడానికి ఈ పద్ధతి ఎంత ప్రయోజనకరంగా ఉందో తెలుసుకుందాం. వేడి నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎల్లప్పుడూ మేలు చేస్తుంది. కావున వేడి నీరు మీ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది. దీంతో.. శరీరం నుండి విష పదార్థాలను తొలగిస్తుంది. ఇక దీని కారణంగా అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఈనేపథ్యంలో.. వేడినీరు తాగడం వల్ల జీవక్రియ కూడా ఆకలిని తగ్గిస్తుంది. అయితే.. ఆహారం తిన్న తర్వాత వేడి నీటిని తాగితే అది జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. మలబద్ధకం, అసిడిటీ, అజీర్ణ సమస్యలు వంటి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు దూరమవుతాయి.

అయితే వేడి నీటిని ఎప్పుడు తాగాలి అనేది ఒక్కరిసారి తెలుసుకుందాం. వేడి నీటిని ఖాళీ కడుపుతో లేదా భోజనం తర్వాత తాగడం బరువు తగ్గడంలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదయం ప్రతి రోజూ వేడి నీటిని తాగితే కొవ్వు కరిగిపోతుంది. భోజనం చేసిన తర్వాత వేడినీరు తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. రోజూ ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగితే పొట్ట కొవ్వు తగ్గుతుంది. మరి వేడినీటిని ఎక్కువ తాగితే అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొవలసి వస్తుంది. నీరు వేడి ఎక్కువగా వుంటే.. బరువును తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. అంతేకాకుండా.. వేడినీటిని ఎక్కువగా తాగితే కూడా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు వైద్య నిపుణులు చెబుతున్నారు. వేడి నీటిని ఎక్కువగా తాగడం వల్ల సిరల్లో వాపు వస్తుంది. దీని వల్ల కొన్నిసార్లు మెదడు నరాలు కూడా ప్రభావితమై తలనొప్పి సమస్య , శరీరం డిటాక్స్ చేస్తుంది. అంతేకాకుండా.. అధిక మొత్తంలో వేడి నీటిని తాగడం వల్ల మూత్రపిండాలపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఇక వేడి నీరు ఎక్కువగా తాగడం వల్ల రక్తనాళాల్లో రక్త ప్రసరణ పెరుగుతుందని, ఇది ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు చెబుతున్నారు.
Komatireddy Raj Gopal Reddy : ఆ నాయకుడు పార్టీ మారడం వల్ల కొత్త చిక్కులు వచ్చిపడుతున్నాయా