నా గుర్తు ఇది కాదు.. అని చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది.సుదీర్ఘ కాలం ఓ పార్టీలో ఉండి, ఇప్పుడు పార్టీ మారటంతో కొత్త చిక్కులొస్తున్నాయి..ఇంతకాలం హస్తంతో ముడిపడిన జనాల మెమొరీని ఇప్పుడు కమలంతో నింపేయటానికి ప్రయత్నాలు చేస్తున్నారట.ఆఖరికి ఓటర్లు కన్ఫ్యూజ్ అయితే పరిస్థితేంటని తలుచుకుని ఆందోళన చెందుతున్నారు.
మునుగోడులో నాది హస్తం కాదు…. కమలం గుర్తని చెప్పుకునే ప్రయత్నంలో రాజగోపాల్ రెడ్డికి టెన్షన్ పెరుగుతోందట..
కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి చేరిన రాజగోపాల్ రెడ్డికి కొత్త తలనొప్పి వచ్చి పడిందట.దాన్ని ఎలా అదిగమించాలి అనే ఆందోళనలో ఉన్నారట.ఎన్నికల్లో గుర్తులు అటూ ఇటైతే అభ్యర్థులు ఓటమిపాలైన సందర్భాలు చాలానే ఉన్నాయి..ఎవరి గుర్తేమిటో ఓటర్లకు రిజిస్టరైతే తప్ప దీనికి పరిష్కారం ఉండదు.చాలా కాలం ఒక పార్టీలో ఉండి, మరో పార్టీలో చేరిన నేతలకు ఇది పెద్ద సమస్యే
కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే కోమటిరెడ్డి బ్రదర్స్ తమ ప్రత్యేకతను చాటుకుని….ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానంలో నిలిచారు.
కానీ, అనుకున్నదొకటి అయిందొక్కటి అన్నట్టుగా పరిస్థితులు మారుతూ వచ్చాయి.తాజాగా కోమటిరెడ్డి బ్రదర్స్ లో ఒకరైన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడారు..
ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ తో సుదీర్ఘ ప్రయాణానికి హ్యాండ్ ఇచ్చి కమలం గూటికి చేరారు. బిజెపిలో చేరిన రాజగోపాల్ రెడ్డికి పార్టీ మారిన తర్వాత కొత్త చిక్కులు, సమస్యలు వచ్చి పడ్డాయట.పార్టీ సభ్యత్వానికి, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన రాజగొపాల్ రెడ్డి, బీజేపీ నుండి బరిలోకి దిగనున్నారు.
అయితే ఇప్పుడు తన గుర్తు హస్తం కాదు…. కమలం అని ప్రచారం చేయడం కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి తాజాగా సవాల్ గా మారిందట….
నిన్నమొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ నేతగా ముద్రపడ్డారు కోమటిరెడ్డి రాజగొపాల్ రెడ్డి.ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుతో ప్రజల్లోకి వెళ్లడం సవాల్ గా మారిందట.
కోమటిరెడ్డి ఇంటిపేరు కాంగ్రెస్ పార్టీ గుర్తు విడదీలేనంత ఇమేజ్ ఉన్న టైంలో కొత్తగా బిజెపి గుర్తుని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి అనే దానిపై మూల్లగుల్లాలు పడుతున్నారట. తేడా వస్తే, అసలుకే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్నారట.
వ్యక్తిగతంగా రాజగోపాల్ రెడ్డి హైలైట్ అయితే ఎన్నికల గుర్తు విషయంలో ఓట్లరు తికమక పడక తప్పదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.దీంతో బీజేపీ పార్టీ, కమలం పువ్వు గుర్తు మాత్రమే ఎన్నికల ప్రచార అంశంగా ఉంటే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట..రాజగోపాల్ రెడ్డితోపాటు ఆయన గుర్తును కూడా కీలకంగా ప్రచారంలోకి తీసుకుపోవాలని
లేకపోతే తీవ్రనష్టం జరుగుతుందని బావిస్తున్నారట.ఓటర్ల ముందు కమలం పువ్వు గుర్తుతో పాటు, కాంగ్రెస్ అభ్యర్థి గుర్తు హస్తం కూడా ఉంటుంది కాబట్టి ఓటరు కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
దీంతో మునుగోడు ఓటర్లకు రిజిస్టర్ అయ్యేలా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన విషయాన్ని, కమలం పువ్వు గుర్తుని ప్రచారం చేయాలని కమలదళం, రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారట. రాజగోపాల్ రెడ్డి మీద ప్రజాభిమానం కాస్తా హస్తం గుర్తు వైపు మళ్లితే తీవ్ర నష్టం జరుగుతుందని కమలదళం ఆందోళన చెందుతోందట.