Alcohol Kills: ఆల్కహాల్ వల్ల ప్రతీ ఏడాది 30 లక్షల మంది మృతి: డబ్ల్యూహెచ్ఓ
- ఆల్కహాల్‌తో లక్షల్లో మరణాలు..
- ప్రతీ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 30 లక్షల మంది మృతి..
- యూరప్‌లో అధిక వినియోగం..
- డబ్ల్యూహెచ్ఓ నివేదికలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Alcohol Kills: ఆల్కహాల్ వినియోగం ప్రజారోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలను చూపిస్తోంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రతీ ఏడాది ఆల్కహాల్ వల్ల దాదాపుగా 30 లక్షల మంది చనిపోతున్నట్లు మంగళవారం వెల్లడించింది. ఇటీవల సంవత్సరాల్లో కొద్దిగా మరణాల సంఖ్య తగ్గినప్పటికీ, ఈ సంఖ్య ఆమోదయోగ్యం కాని అధికంగానే ఉన్నట్లు పేర్కొంది. ఐక్యరాజ్యసమితి ఆరోగ్య సంస్థ మద్యం, ఆరోగ్యంపై తాజాగా నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 20 మంది మరణిస్తే అందులో ఒకరు ఆల్కహాల్ వల్లే చనిపోతున్నారని తెలిపింది. ఆల్కహాల్ తాగి డ్రైవింగ్ చేయడం, దీని వల్ల చెలరేగే హింస, దుర్వినయోగం, ఇతర వ్యాధులు, రుగ్మతలు ఇందులో ఉన్నాయి.
2019లో ఆల్కహాల్ వినియోగం వల్ల 2.6 మిలియన్ల మరణాలు సంభవించినట్లు నివేదిక పేర్కొంది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం.. ఈ ఏడాది మొత్తం మరణాల్లో 4.7 శాతం ఆల్కహాల్ వినియోగం వల్ల చోటు చేసుకున్నాయి. ఈ మరణాల్లో మూడోవంత పురుషులే అని చెప్పింది. మత్తుపానీయాల వినియోగం వ్యక్తిగత ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని, మానసిక ఆరోగ్యంపై ప్రభావం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతోందని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు. ఇవన్నీ నివారించగల మరణాలే అని అన్నారు.
Also Read
- Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే "వెజ్ ఆమ్లెట్".. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
- Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
- Kakarakaya Vepudu: అన్నంలోకి 'కాకరకాయ వేపుడు'.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
Read Also: Bhaichung Bhutia: రాజకీయాలకు ఫుట్‌బాల్ దిగ్గజం భైచుంగ్ గుడ్‌బై
అన్ని సమస్యల్లో ఒక మంచి విషయం ఏంటంటే 2010 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ వినియోగం కొంత తగ్గిందని నివేదిక పేర్కొంది. కానీ ఆల్కహాల్ వల్ల ఆరోగ్యం, సామాజిక భారం ఇంకా ఎక్కువగానే ఉందని పేర్కొన్నారు. యువత అసమానంగా ప్రభావితమైందని హైలెట్ చేశారు. 2019లో సంభవించిన మరణాల్లో 20-39 వయసున్న వారు 13 శాతం ఉన్నట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
లివర్ సిర్రోసిస్, కొన్ని క్యాన్సర్లతో సహా అనేక పరిస్థితులు మద్యపానంతో ముడిపడి ఉన్నాయి. 2019 లో ఇది సంభవించిన అన్ని మరణాలలో, 1.6 మిలియన్లు సంక్రమించని వ్యాధుల నుండి వచ్చినవారే అని నివేదిక చెప్పింది. వీరిలో 474,000 మంది హృదయ సంబంధ వ్యాధుల వల్ల, 401,000 మంది క్యాన్సర్ వల్ల , 724,000 మంది ట్రాఫిక్ ప్రమాదాల వల్ల, మరికొందరు స్వీయహాని వల్ల మరణించారు. ఆల్కహాల్ దుర్వినియోగం క్షయ, హెచ్ఐవీ, న్యూమోనియా వంటి వ్యాధులకు కారణమవుతోందని నివేదిక పేర్కొంది. 2019లో 209 మిలియన్ల మందికి అల్కహాల్ అలవాటు ఉన్నట్లు, ఇది ప్రపంచ జనాభాలో 3.7 శాతమని చెప్పింది.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం తలసరి వినియోగం తొమ్మిదేళ్ల క్రితం 5.7 లీటర్ల నుంచి 2019లో 5.5 లీటర్లకు స్వల్పంగా తగ్గిందని నివేదిక కనుగొంది. 15 ఏళ్లకు పైబడిన ప్రపంచజనాభాలో సగం మంది మద్యానికి దూరంగా ఉన్నారు. యూరప్‌లో ఎక్కువగా మద్యం తీసుకుంటున్నారు, సగటున 9.2 లీటర్ల మద్యాన్ని తాగుతుండగా, అమెరికాలో 7.5 లీటర్లు తాగుతున్నారు. తక్కువ వినియోగం ఉత్తర ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఆసియా దేశాల్లో ముఖ్యంగా ముస్లిం దేశాల్లో ఉందని నివేదిక వెల్లడించింది.
- Tags
- alcohol
- alcohol deaths
- WHO
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!