NTV Telugu Site icon

Dengue: డెంగ్యూ వ్యాధి సోకకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

New Project (17)

New Project (17)

డెంగ్యూ అనేది భారతదేశంలో ప్రజారోగ్యాన్ని ప్రభావితం చేసే వైరల్ వ్యాధి. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతుంటారు. దోమల కాటు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ వ్యాధి ఇన్ఫెక్షన్, డెంగ్యూ జ్వరం (DF), డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్/డెంగ్యూ షాక్ సిండ్రోమ్ (DHF/DSS) మొదలైన అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతుంది. డెంగ్యూ చికిత్స కోసం లైసెన్స్ పొందిన వ్యాక్సిన్ లేదా నిర్దిష్ట యాంటీవైరల్ థెరపీ అందుబాటులో లేదు. కానీ సప్లిమెంట్ మందులు ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాధిని ముందుగా గుర్తించడం డెంగ్యూ చికిత్సకు సహాయపడుతుంది. కాబట్టి, డెంగ్యూ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇప్పుడు చూద్దాం.

READ MORE: Gold Rate Today: బంగారం ధరలకు బ్రేక్.. కొనేందుకు ఇదే సరైన సమయం!

రాత్రిపూట దోమల నుంచి రక్షించుకోవడానికి దోమ తెరలని వాడుతారు. కానీ రాత్రిపూట దోమలు కుట్టడం వల్ల ఎలాంటి డెంగ్యూ వ్యాధి సోకదు. డెంగ్యూ జ్వరం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కుట్టే గోధుమ రంగు గల ఆడ ఏడిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. డెంగ్యూ దోమలు నీటిని ఇష్టపడతాయి. కాబట్టి నివసించే చుట్టుపక్కల ప్రాంతాలలో, పిల్లలు ఆడుకునే ప్రదేశాలలో నీటిని ఉంచాకూడదు. పిల్లలను బడికి పంపేటప్పుడు దోమల నివారణ దుస్తులు, ఫుట్ బ్యాగ్ (సాక్స్‌తో కూడిన షూ) ధరించాలి.
యాంటీ దోమల స్ప్రేలతో ఇంటిని పిచికారీ చేయండి. పిల్లలకు సరైన పౌష్టికాహారం ఇవ్వడం మంచిది. సాయంత్రం వేళల్లో కిటికీలు, తలుపులు మూసి ఉంచాలి. ఫిల్టర్ లేదా కాచి ఒడబోసిన నీళ్లు మాత్రమే తాగాలి. ఇంటి మూలల్లో తరుచూ శుభ్రం చేస్తూ ఉండాలి.